'లగాన్' కంటే డబుల్‌ సాధించిన మాట వాస్తవం

తాజాగా ఆయన నటించిన గదర్‌ 2 సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యం లో సన్నీ సదరు వ్యాఖ్యలు చేశాడు.

Update: 2023-08-07 07:58 GMT

ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీలో లగాన్ చాలా ప్రత్యేకమైన సినిమా అనడంలో సందేహం లేదు. ఆస్కార్‌ వరకు వెళ్లిన సినిమా అవ్వడంతో పాటు ప్రతి ఇండియన్ ని కూడా భావోద్వేగంతో కట్టిపడేసే సినిమా అనడంలో సందేహం లేదు. అలాంటి సినిమా కమర్షియల్ గా అప్పట్లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

అయితే లగాన్ విడుదల అయిన రోజే విడుదల అయిన సన్నీ డియోల్‌ చిత్రం గదర్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతే కాకుండా లగాన్ సాధించిన వసూళ్లతో పోల్చితే రెండు మూడు రెట్లు ఎక్కువ వసూళ్లు నమోదు చేసింది అనేది బాక్సాఫీస్‌ వర్గాల టాక్. తాజాగా సన్నీ డియోల్‌ కూడా స్వయంగా ఆ వ్యాఖ్యలు చేశాడు.

లగాన్ కంటే తన గదర్ సినిమా రెండు మూడు రెట్ల వసూళ్లు ఎక్కువగా నమోదు చేసిందని పేర్కొన్నాడు. అంతే కాకుండా అప్పట్లో గదర్ సినిమా వ్యాపారం రికార్డు స్థాయి అన్నట్లుగా ఆయన పేర్కొన్నాడు. తాజాగా ఆయన నటించిన గదర్‌ 2 సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యం లో సన్నీ సదరు వ్యాఖ్యలు చేశాడు.

సన్నీ డియోల్‌ గదర్ సినిమాను అప్పట్లో లగాన్ సినిమాకు పోటీగా అంటే ఆమీర్ ఖాన్‌ కు పోటీగా విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు గదర్ 2 సినిమాను బాలీవుడ్ సూపర్ స్టార్‌ అక్షయ్ కుమార్‌ నటించిన ఓమై గాడ్ 2 సినిమాకు పోటీగా రిలీజ్ చేసేందుకు సిద్ధం అయ్యారు.

అప్పట్లో ఎలా అయితే అమీర్‌ ఖాన్‌ సినిమాపై గదర్‌ సినిమా పై చేయి సాధించిందో ఇప్పుడు అలాగే ఓమై గాడ్‌ 2 సినిమాపై గదర్ 2 సినిమా పై చేయి సాధిస్తుందనే నమ్మకంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 11న గదర్ 2 తో పాటు ఓమై గాడ్ 2 సినిమాలు రాబోతున్నాయి. ఈ రెండు సినిమాల ఫలితంపై బాలీవుడ్ వర్గాల వారు ఆసక్తిగా ఉన్నారు.

Tags:    

Similar News