పో*ర్న్ స్టార్ ముద్ర పిల్ల‌ల‌పై ప‌డ‌నీయ‌ను!

బాలీవుడ్ న‌టి స‌న్నిలియోన్ కెరీర్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. వ్య‌క్తిగ‌త జీవితంలో ఎన్నో స‌వాళ్లు ఎదుర్కుని బాలీవుడ్ లో న‌టిగా స్థిర‌ప‌డింది.

Update: 2023-12-23 15:30 GMT

బాలీవుడ్ న‌టి స‌న్నిలియోన్ కెరీర్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. వ్య‌క్తిగ‌త జీవితంలో ఎన్నో స‌వాళ్లు ఎదుర్కుని బాలీవుడ్ లో న‌టిగా స్థిర‌ప‌డింది. అయినా అప్పుడ‌ప్పుడు స‌న్నిగ‌తాన్ని గుర్తు చేసుకుంటూ వాపోయిన సంద‌ర్భాలెన్నో ఉన్నాయి. పోర్న్ స్టార్ గా ఎలాంటి ప‌రిస్థితుల్లో మారాల్సి వ‌చ్చింది? ఎందుకు అటువైపు జీవితాన్ని మ‌లుచుకోవాల్సి వ‌చ్చింద‌ని ఎన్నో సంద‌ర్బాల్లో గుర్తు చేసింది. ప్ర‌స్తుతం పో*ర్న్ స్టార్ అనే ట్యాగ్ ని చెరిపేసుకుని న‌టిగా ప్రేక్ష‌కుల నీరాజ‌నాలు అందుకుంటుంది.


వ్య‌క్తిగ‌త జీవితంలో డేనియ‌ల్ వెబ‌ర్ ని వివాహం చేసుకుని ధాంప‌త్య జీవితంలోను ఎంతో సంతోషంగా ఉంది. ఇక ఈ దంప‌తుల‌కు ముగ్గురు పిల్ల‌లు. ఓ పాప‌ని ద‌త్త‌త తీసుకుని త‌ల్లిదండ్రుల ప్రేమ‌ను పంచుతున్నారు. మ‌రో ఇద్ద‌రు పిల్ల‌ల్ని స‌రోగ‌సి విధానంలో క‌న్నారు. తాజాగా పిల్ల‌ల విష‌యంలో ఆ దంప‌తుల ఎలాంటి కేరింగ్ తీసుకుంటారు? అన్న వివ‌రాల్ని స‌న్నిలియోన్ ఓ ఇంట‌ర్వ్యూలో రివీల్ చేసింది.

పిల్లల విషయంలో అందరు తల్లిదండ్రుల్లాగే మాకూ భయం ఉంది. ఇంట్లో పిల్లలు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ఏం ముట్టుకున్నారు? నిరంతరం ఇదే ఆందోళన. నేనైతే బయటికి వెళ్లినప్పుడు పిల్లలు మాస్కులు సరిగా పెట్టుకున్నారా లేదా? క్షణక్షణం పరిశీలిస్తుంటాను. నాకు తెలియకుండానే నాలో ఆందోళన మొదలవుతుంది. నా ఫ్రెండ్స్‌ కూడా తమ పిల్లల పట్ల ఇదే భయంతో మెలుగుతున్నారు. నా భర్త డేనియల్‌ పిల్లలంటే ప్రాణం పెడతాడు. ఇంట్లోకి వాళ్లొచ్చాకే తెలిసింది. అతను అంత సున్నిత మనస్కుడని.

అంటే - పిల్లలు కూడా ఇతరుల ప్రేమానురాగాలను అద్దంలో చూపినట్లు చూపుతారన్నమాట. తక్కువ సమయంలోనే మా ఇంట్లోకి ముగ్గురు పిల్లలు రావడం మా అదృష్టం. అప్పట్లో (2017) ఆడపిల్ల నిషాను దత్తత తీసుకున్నాం. దాంతో మా లోకమే మారిపోయింది. ఆ తరువాత సరోగసీ (గర్భదానం) పద్ధతిలో ఇద్దరు మగ పిల్లలు (నోహ- యాషెర్‌) తోడయ్యారు. వాళ్లు ఇంటికి వచ్చిన రోజు నిషా ఆనందం చెప్పలేనంత. అంత సంబరపడుతుందని ఊహించలేదు.

ఇప్పుడు దేవుడు మాకు పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడు. ఒకప్పుడు మేము పిల్లల కోసం కలలు కనేవాళ్లం. ఆ కల నిజమైందిప్పుడు. నా రక్తం పంచుకు పుట్టకపోయినా నా పిల్లలే కదా. ఒకప్పుడు నేను పో*ర్న్‌స్టార్‌ను. అది నా వృత్తి. నేను ఎక్కడా ఆత్మాభిమానాన్ని పోగొట్టుకోను. గతం గురించి ఎప్పుడూ ఆలోచించను. పిల్లల పెంపకంపైన ఆ ప్రభావాన్ని పడనీయను. సమాజంలో మంచి మనుషులుగా తీర్చిదిద్దాలన్నదే నా కోరిక. పెద్దయ్యాక వాళ్లు డాక్టర్లు అవుతారా? ఇంజినీర్లా? లాయర్లా? వ్యోమగాములా? లేదంటే ఏకంగా అమెరికా ప్రెసిడెంట్‌ అవుతారా? అది వాళ్లిష్టం. ఆ అవకాశం వారికే వదిలేస్తాం. స్వేచ్ఛగా.. హాయిగా.. మనుషులుగా పెంచిపెద్ద చేయడమే మా బాధ్యత` అని అంది.

Tags:    

Similar News