కంగువ : సూర్యపై AI ప్రయోగం
సూర్య అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఉత్కంఠగా వేచి చూస్తున్నారు. సరైన అప్ డేట్స్ కోసం వెయిటింగ్.
2024 మోస్ట్ అవైటెడ్ సినిమాల జాబితాలో సూర్య నటించిన `కంగువ` ఒకటి. తెలుగు వాడైన `దరువు` శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. స్టూడియోగ్రీన్ సంస్థ ఈ చిత్రం కోసం అత్యంత భారీ బడ్జెట్ ని ఖర్చు చేసింది. కంగువ దాదాపు 30 భాషల్లో విడుదలవుతుందని కోలీవుడ్ మీడియాలో కథనాలొచ్చాయి. 14 నవంబర్ 2024న పాన్ ఇండియా రిలీజ్ కోసం అన్ని ఏర్పాట్లు సాగుతున్నాయని సమాచారం.
సూర్య అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఉత్కంఠగా వేచి చూస్తున్నారు. సరైన అప్ డేట్స్ కోసం వెయిటింగ్. ఇలాంటి సమయంలో నిర్మాత కెఇ జ్ఞానవేల్ రాజా గత రాత్రి జరిగిన ఎక్స్ స్పేస్ సెషన్‌లో అద్భుతమైన అప్‌డేట్‌ను షేర్ చేయడంతో కంగువ మరోసారి హెడ్ లైన్స్ లోకొచ్చింది. తమిళ వెర్షన్‌కి సూర్య వ్యక్తిగతంగా డబ్బింగ్ చెప్పగా, తొలిసారిగా ఇతర భాషల్లో డబ్బింగ్ చేయడానికి AI టెక్నాలజీని ఉపయోగించనున్నట్లు ఆయన వెల్లడించారు. అంటే సూర్య గొంతును పొరుగు భాషల కోసం ఏఐలో ఉపయోగిస్తారన్నమాట. కోలీవుడ్‌లో ఈ తరహా ఇదే తొలిసారి. ఇది ఇటీవలి ట్రెండ్ కు సూచిక. వెట్టయన్‌లో అమితాబ్ బచ్చన్ వాయిస్ నాణ్యత మెరుగుదల కోసం ఏఐని ఉపయోగించారు. ఇప్పుడు అమితాబ్ తర్వాత సూర్యపై అలాంటి ప్రయోగం చేస్తున్నారు. ఈ వినూత్న విధానం ఎంతవరకు విజయవంతమవుతుందనేది ఆసక్తికరంగా మారింది.
ఈ చిత్రం అన్ని ప్రధాన భారతీయ భాషలతో పాటు ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్ భాషలలో కూడా గ్రాండ్ రిలీజ్ అవుతుందని జ్ఞానవేల్ ధృవీకరించారు. అటుపై చైనీస్, జపనీస్ వెర్షన్లను కూడా రిలీజ్ చేస్తారని సమాచారం. అయితే ఐమ్యాక్స్ విడుదలకు ఎటువంటి ప్రణాళికలు లేవని తెలుస్తోంది. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో దిశా పటాని కథానాయికగా నటిస్తుండగా, బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ - యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి.