ఎల్లే కవర్‌పై మిల్కీ వైట్ బ్యూటీ దుమారం
ఇదిలా ఉంటే తమన్నా ఇటీవల రవీనా టాండన్ కుమార్తె రాషా టాండన్ మొదటి మూవీ అజాద్ ప్రీమియర్ లో సందడి చేసింది.;

తమన్నా భాటియా వృత్తిగత జీవితం కంటే ఎక్కువగా లవ్ లైఫ్ గురించే అభిమానులు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. నటుడు విజయ్ వర్మతో తమన్నా ప్రేమాయణం ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఇటీవలే అతడికి మిల్కీ వైట్ బ్యూటీ బ్రేకప్ చెప్పేసిందన్న ముచ్చటా సాగుతుండగా, తమన్నా క్రిప్టిక్ పోస్ట్ వైరల్ అయింది. ఇదిలా ఉంటే తమన్నా ఇటీవల రవీనా టాండన్ కుమార్తె రాషా టాండన్ మొదటి మూవీ అజాద్ ప్రీమియర్ లో సందడి చేసింది. రాషా తనను 'ఆంటీ' అని పిలిచేసినా ఎక్కడా నొచ్చుకోకుండా నువ్వు అలా పిలవొచ్చు అని మద్ధతు గా నిలిచింది.

మరోవైపు తమన్నా ఫ్యాషన్ గేమ్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. సోషల్ మీడియాల్లో వరుస ఫోటోషూట్లను షేర్ చేస్తూ హీటెక్కిస్తోంది. తాజాగా తమన్నా షేర్ చేసిన బాస్ లేడీ లుక్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. తమన్నా టాప్ టు ఆటమ్ బ్లాక్ లుక్ లో అదిరిపోయిందన్న ప్రశంసలు కురుస్తున్నాయి. అల్ట్రా మోడ్రన్ డిజైనర్ డ్రెస్ లో తమన్నా ఎంతో అందంగా కనిపిస్తోంది. ఇన్నర్ సొగసును ఎలివేట్ చేసే యూనిక్ ఫ్రాక్.. ఇండోర్ షూట్ లో తమన్నా ఎక్స్ క్లూజివ్ గా కనిపిస్తోంది.
ప్రఖ్యాత ఎల్లే ఇండియా ఫోటోషూట్ ఇది. ఎల్లే టీమ్ కి తమన్నా ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలిపింది. సాంప్రదాయేతర ఎక్స్ ప్రెషన్, క్రియేటివిటీని స్వీకరిస్తానని, జీవితాన్ని అలాగే చూడటానికి ఇష్టపడతానని తమన్నా అన్నారు. నన్ను పెర్ఫార్మర్ ఆఫ్ ది ఇయర్‌గా గుర్తించినందుకు.. నా అభిరుచులను - సినిమాల నుండి ఫ్యాషన్ వరకు ..నా మొట్టమొదటి ఆభరణాలను డిజైన్ చేయడం వంటి కొత్త సృజనాత్మక ప్రక్రియలను సెలబ్రేట్ చేసినందుకు @elleindia కి ధన్యవాదాలు.. అని రాసింది.
ఇయర్ ఆఫ్ ది స్నేక్ స్ఫూర్తితో `డోల్స్ & గబ్బానా దుస్తులను తమన్నా ఎంపిక చేసుకుంది. ఈ సంవత్సరం ప్రారంభమైన విధానాన్ని ప్రేమిస్తున్నాను. 2025లో ఎలాంటి విషయాలు ఉన్నాయో చూడాలి. అన్నిటినీ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను.. తమన్నా ఈ ఫోటోషూట్ తో పాటు సుదీర్ఘ నోట్ ని షేర్ చేసింది.