ఆజ్ కీ రాత్.. మొదట వద్దన్న తమన్నా
మిల్కీ బ్యూటీ తమన్నా సుదీర్ఘ కెరీర్ లో హీరోయిన్ గానే కాకుండా ఐటెం సాంగ్స్ లో కూడా చేసి తనదైన ముద్ర వేసింది.
మిల్కీ బ్యూటీ తమన్నా సుదీర్ఘ కెరీర్ లో హీరోయిన్ గానే కాకుండా ఐటెం సాంగ్స్ లో కూడా చేసి తనదైన ముద్ర వేసింది. హీరోయిన్స్ లో కొద్ది మంది మాత్రమే ఐటం సాంగ్స్ చేశారు. అందులో తమన్నా ముందు ఉంటుంది అనడంలో సందేహం లేదు. కెరీర్ ఆరంభంలో పెద్దగా ఐటం సాంగ్స్ పై ఆసక్తి చూపించని తమన్నా గడచిన నాలుగు అయిదు సంవత్సరాలుగా పలు సినిమాల్లో ఐటం సాంగ్స్ చేయడం ద్వారా ఆయా సినిమాల హిట్ లో కీలక పాత్ర పోషించింది అనడంలో సందేహం లేదు. హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నా మరోసారి బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇదే సమయంలో ఐటెం సాంగ్స్ తో అలరిస్తోంది.
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమాలో వా.. నువ్వు కావాలయ్యా.. పాటతో యూత్ తో పాటు అందరినీ ఉర్రూతలూగించిన ముద్దుగుమ్మ తమన్నా ఇప్పుడు స్త్రీ 2 సినిమాలోని ఆజ్ కీ రాత్ పాటతో అదే స్థాయిలో దూసుకు పోతుంది. బాలీవుడ్ లో ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచిన స్త్రీ 2 సినిమాలో తమన్నా ఐటెం సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ మొదట తనను స్త్రీ 2 సినిమాలోని ఐటం సాంగ్ కు సంప్రదించిన సమయంలో నో చెప్పాను. ఆసక్తి లేదని తేల్చి చెప్పాను.
జైలర్ సినిమాలో నేను చేసిన ఐటెం సాంగ్ కి మంచి స్పందన వచ్చింది. నేను ఏ పాట చేసినా కూడా ప్రేక్షకులు అదే స్థాయిలో ఉండాలని ఆశిస్తారు. అందుకే మరో ఐటెం సాంగ్ ను కమిట్ అయ్యేందుకు భయం వేసింది. వెంటనే అంటే కచ్చితంగా జైలర్ పాటతో పోల్చి చూస్తారు. కనుక స్త్రీ 2 కోసం అడిగిన సమయంలో నేను అదే చెప్పాను. పాట కాస్త అటు ఇటు అయినా సినిమా ఫలితం పై ప్రభావం చూపించే అవకాశం ఉందని అన్నాను. అయినా కూడా దర్శకుడు నన్ను ఒప్పించి, నాతో ఆ పాటను చేయించాడు అని తమన్నా చెప్పుకొచ్చింది.
వా నువ్వు కావాలయ్యా పాట మాదిరిగానే స్త్రీ 2 లోని ఆజ్ కీ రాత్ పాట యూత్ కి బాగా ఎక్కింది. హిందీ ప్రేక్షకులు ఈ పాటను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు యూట్యూబ్ లో ఆ పాటకు ఏకంగా 200 మిలియన్ ల వ్యూస్ వచ్చాయి. భారీ ఎత్తున లైక్స్ రావడంతో పాటు ఐటెం సాంగ్స్ లో తమన్నా ను మించిన హీరోయిన్ మరెవ్వరు లేరు అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇక స్త్రీ 2 సినిమా వసూళ్లలో ఇప్పటికే రూ.500 కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది. త్వరలోనే ఓటీటీ స్ట్రీమింగ్ అవ్వబోతున్న ఈ సినిమా మరింతగా వసూళ్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయని బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు.