పెళ్లి విషయంలో తమన్నా ఇలా ట్విస్ట్ ఇచ్చిందేంటి?
ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా పలు మీడియా సంస్థలతో తమన్నా మాట్లాడుతూ విజయ్ వర్మ తో రిలేషన్ గురించి స్పందించింది
మిల్కీ బ్యూటీ తమన్నా గత కొన్నాళ్లుగా విజయ్ వర్మ తో ప్రేమలో ఉందనే వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం చాలా దూరం వెళ్లిందని కూడా వార్తలు వచ్చాయి. ఇద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు.. ఇద్దరు పలు కార్యక్రమాల్లో కనిపించడంతో మీడియాలో ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు కథనాలు రాయడం మొదలు పెట్టారు.
ఇప్పటివరకు తమన్నా కానీ, విజయ్ వర్మ కానీ ఇద్దరిలో ఏ ఒక్కరు ప్రేమ విషయమై క్లారిటీ ఇవ్వలేదు. విజయ్ వర్మ స్పందిస్తూ డైరెక్ట్ గా చెప్పకున్నా హింట్ ఇచ్చినట్లుగా మాట్లాడాడు. కానీ తమన్నా మాత్రం తమ ఇద్దరి మధ్య ఏమీ లేదు అన్నట్లుగా తేల్చేసింది. ఇద్దరం మంచి స్నేహితులం మాత్రమే అన్నట్లుగా కూడా ఆమె వ్యాఖ్యలు చేసింది.
మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా జైలర్ మరియు భోళా శంకర్ సినిమాల్లో నటించిన విషయం తెల్సిందే. ఆ రెండు సినిమాలు ఒకేసారి విడుదల కాబోతున్నాయి.
ఆ రెండు సినిమాలకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా పలు మీడియా సంస్థలతో తమన్నా మాట్లాడుతూ విజయ్ వర్మ తో రిలేషన్ గురించి స్పందించింది.
ఇప్పటికే మీడియాలో చాలా ఎక్కువ కథనాలు వచ్చాయి. నేను ఏమీ మాట్లాడాలి అనుకోవడం లేదు. ఈ అంశంపై నేను కొత్తగా చెప్పాలనుకోవడం లేదు. పెళ్లి ప్రస్తావన లేనేలేదు. తాను ఇప్పట్లో పెళ్లి చేసుకోను అని చెప్పేసింది. తమన్నా వ్యాఖ్యలతో ఇంతకు విజయ్ వర్మతో ఈమె ప్రేమలో ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇక మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్ విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో అవకాశాలు కాస్త తగ్గాయనే చెప్పాలి. దాంతో వెబ్ సిరీస్ ల్లో నటిస్తోంది. అదృష్టం కొద్ది జైలర్ మరియు భోళా శంకర్ సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంది. జైలర్ సినిమాలో ఈమె పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత ఉన్నట్లుగా కనిపించడం లేదు. భోళా శంకర్ లో అయినా ఈమె పాత్రకు ప్రాముఖ్యత ఉంటుందా అనేది చూడాలి.