త‌మ‌న్నా కోర్టు కేసు వాయిదా ప‌డిందా!

మిల్కీబ్యూటీ బ్రాండ్ ఇమేజ్ ని తెలివిగా ఎన్ క్యాష్ చేసుకుంటోన్న సంగ‌తి తెలిసిందే.

Update: 2024-08-22 08:30 GMT

మిల్కీబ్యూటీ బ్రాండ్ ఇమేజ్ ని తెలివిగా ఎన్ క్యాష్ చేసుకుంటోన్న సంగ‌తి తెలిసిందే. సినిమాల‌తో పాటు వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లోనూ న‌టిస్తూ రెండు చేతులా సంపాద‌నే చూస్తోంది. అయితే ఓ సంస్థ‌కు సంబంధించిన ప్ర‌క‌ట‌న ఆ మ‌ధ్య వివాదాస్ప‌దంగా మారిన సంగ‌తి తెలిసిందే. వివాదం ఏకంగా కోర్టు కు వెళ్లింది. ఒప్పందం గడువు పూర్త‌యినా త‌మ‌న్నా న‌టించిన యాడ్ ని ఇంకా ప్ర‌సారం చేయ‌డంపై త‌మ‌న్నా అభ్యంత‌రం చెబుతూ కోర్టుకు వెళ్లింది.

దీనికి సంబంధించి చెన్నై కోర్టులో ప‌లుమార్లు విచార‌ణ జ‌రిగింది. త‌మ‌న్నా వాద‌న‌ను అంగీక‌రించిన కోర్టు ఆ యాడ్ పై నిషేధం కూడా విధించింది. అయిన‌ప్ప‌టికీ కోర్టు తీర్పును ధిక్క‌రించి ప్ర‌క‌ట‌న ప్ర‌సారం చేస్తున్నార‌ని త‌మ‌న్నా అరోపించింది. తాజాగా దీనికి సంబంధించి న్యాయ‌మూర్తి సెంథిల్ కుమార్, రామ మూర్తిల డివిజ‌న్ బెంచ్ లో విచార‌ణ‌కు వ‌చ్చింది.

దీంతో వాణిజ్య సంస్థ త‌రుపున హాజ‌రైన న్యాయ వాది కృష్ణ‌కుమార్ త‌మ‌న్నా చెప్పిన‌ట్లుగానే ప్ర‌సారం ఆపేసామ‌ని కానీ త‌మ‌కు తెలియ‌ని ప్ర‌యివేటు వ్య‌క్తులు ప్ర‌సారం చేస్తున్నార‌ని, దానికి తాము ఎలా బాధ్యులు అవుతామ‌ని వాదించారు. దీంతో ఈ కేసులో రీపిటీష‌న్ దాఖలు చేయాల‌ని న్యాయ‌మూర్తులు త‌దుప‌రి విచార‌ణ సెప్టెంబ‌ర్ 2కి వ వాయిదా వేసారు.

ఒక స‌బ్బు సంస్థంపై త‌మ‌న్నా చెన్నై హైకోర్టులో కోర్టులో పిటీష‌న్ దాఖ‌లు చేసింది. అయితే దీన్ని హైకోర్టు కొట్టేసి కింద కోర్టుకు వెళ్ల‌మ‌ని చెప్పిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం త‌మ‌న్నా న‌టిగా బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే `స్త్రీ-2` లో ఐటం పాట‌తో మ‌రోసారి మెరిసింది. అమ్మ‌డికిదే బాలీవుడ్ లో తొలి ఐటం నెంబ‌ర్. ల‌క్కీగా స‌క్సెస్ అవ్వ‌డంతో ఇక‌పై అక్క‌డా న‌ర్త‌కిగా బిజీ అవుతుంది.

Tags:    

Similar News