నమ్మినవాళ్లే నన్ను వెన్నుపోటు పొడిచారు: తమన్
ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న బాలయ్య రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
దక్షిణాది పరిశ్రమలో సెన్సేషననల్ మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ తనకంటూ ప్రత్యేక క్రేజ్, గుర్తింపు సంపాదించుకున్నాడు. ఎలాంటి జానర్ సినిమానైనా సరే తమన్ తన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఎలివేట్ చేస్తున్నాడు. మరీ ముఖ్యంగా కొన్ని మాస్ సినిమాలకు తమన్ ఇచ్చే రీరికార్డింగ్ సినిమా స్థాయిని అమాంతం పెంచేస్తుంది.
ముఖ్యంగా నందమూరి బాలయ్య సినిమాలకు తమన్ నెక్ట్స్ లెవెల్ లో మ్యూజిక్‌ను, బీజీఎంను అందిస్తాడు. అందుకే తమన్ ను బాలయ్య ఫ్యాన్స్ ముద్దుగా నందమూరి తమన్ అని పిలుచుకుంటారు. వారిద్దరి కలయికలో ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నీబ్లాక్ బస్టర్లే. రీసెంట్ గా డాకు మహారాజ్ సినిమాతో వారిద్దరూ కలిసి మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న బాలయ్య రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కెరీర్లో తానెన్నో విషయాలను నేర్చుకున్నానని, కొందరిని నమ్మి చాలా మోసపోయానని అన్నాడు. లైఫ్ లో ఏదొక టైమ్ లో మనం కొందర్ని గుడ్డిగా నమ్ముతామని, తాను కూడా అలానే నమ్మానని, కానీ తాను నమ్మిన వాళ్లే తనకు వెన్నుపోటు పొడిచారని తమన్ వెల్లడించాడు.
తన గురించి తన ముందు బాగా మాట్లాడి, బయటకు వెళ్లి చాలా చెత్తగా మాట్లాడేవారని, కొందరిని నమ్మి డబ్బు కూడా చాలా పోగొట్టుకున్నట్టు తెలిపిన తమన్, లైఫ్ లో ఎదురైన ఒడిదుడుకుల వల్ల చాలా పాఠాలు నేర్చుకున్నట్టు చెప్పాడు. తనకు క్రికెట్ అంటే చాలా ఇష్టమని, పని ఒత్తిడి ఎక్కువైనప్పుడు క్రికెట్ ఆడతానని తెలిపాడు.
క్రికెట్ ఆడితే తాను అన్నీ మర్చిపోయి రిలాక్స్ అవుతానని, స్టార్ క్రికెటర్లు ఆడే గ్రౌండ్ లో ఆడాలని తనకు ఎప్పటినుంచో ఆశ ఉండేదని, కానీ అప్పట్లో అది కుదరలేదని చాలా బాధపడేవాడినని చెప్పిన తమన్, ఇప్పుడు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ పుణ్యమా అనా ఆ ఆశ తీరిందని, గత ఐదేళ్లుగా తాను తెలుగు చిత్ర పరిశ్రమ తరపున ఆడే క్రికెట్ టీమ్ లో భాగమైనట్టు చెప్పుకొచ్చాడు.