గేమ్ చేంజర్.. మాకు నమ్మకం లేదు దొర!

వీలైనంత వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకి తీసుకొని రావాలని అనుకుంటున్నారు.

Update: 2024-09-19 14:30 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘గేమ్ చేంజర్’ మూవీ షూటింగ్ ఫైనల్ గా ఇటీవల కంప్లీట్ అయ్యింది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఊపందుకున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రెడీ అవుతోన్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే గత మూడేళ్ళ నుంచి ఈ సినిమా నిర్మాణ దశలోనే ఉంది. శంకర్ ఒకే సారి ‘ఇండియన్ 2’, ‘గేమ్ చేంజర్’ మూవీస్ చేయడం వలన సుదీర్ఘకాలం టైం తీసుకున్నారు. ‘ఇండియన్ 2’ మూవీని ఇప్పటికే రిలీజ్ చేశారు. ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది.

ప్రస్తుతం శంకర్ ‘గేమ్ చేంజర్’ పైన పూర్తిస్థాయిలో ఫోకస్ చేశారు. వీలైనంత వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకి తీసుకొని రావాలని అనుకుంటున్నారు. అయితే ఈ సినిమాపై ఆశించిన స్థాయిలో బజ్ లేదు. ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్ కూడా సినిమాపై పెద్దగా హైప్ క్రియేట్ చేయలేదు. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తోన్న పాన్ ఇండియా మూవీ అనే ఒక్క హైప్ మాత్రమే ‘గేమ్ చేంజర్’ పై ఉంది.

అయితే ఈ బజ్ సినిమాని ఎంత బలంగా పబ్లిక్ లోకి తీసుకొని వెళ్తుందనేది చెప్పలేని విషయం. ఇదిలా ఉంటే గతంలో దిల్ రాజు ‘గేమ్ చేంజర్’ రిలీజ్ క్రిస్మస్ కి ఉంటుందని ప్రకటన చేశారు. అయితే డేట్ మాత్రం కన్ఫర్మ్ చేయలేదు. ఈ మూవీ రిలీజ్ ఎప్పుడనేది పూర్తిగా శంకర్ చేతిలోనే ఉంది. ఇక తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ‘గేమ్ చేంజర్’ రిలీజ్ పై అప్డేట్ ఇచ్చారు. డిసెంబర్ 20న ‘గేమ్ చేంజర్’ రిలీజ్ కన్ఫర్మ్ అన్నారు. థమన్ మాటలతో మెగా ఫ్యాన్స్ కొంత హ్యాపీగా ఫీల్ అయ్యారు.

అయితే థమన్ మాటలు ఎంత వరకు నమ్మొచ్చు అనేదానిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ‘గేమ్ చేంజర్’ సెకండ్ సింగిల్ ఆగష్టు నెలాఖరులో వస్తుందని థమన్ గతంలో చెప్పారు. అయితే సాంగ్ రిలీజ్ కాలేదు. తరువాత వినాయకచవితికి అప్డేట్ ఉంటుందని హింట్ ఇచ్చాడు. అది కూడా జరగలేదు. మరి ఇప్పుడు రిలీజ్ డేట్ నే ఏకంగా కన్ఫర్మ్ చేశారు. దీంతో ఇది ఎంత వరకు కన్ఫర్మ్ అవుతుందో చెప్పలేం. ఇక మాకు నమ్మకం లేదు దొర.. అంటూ నెటిజన్స్ నుంచి ఫన్నీగా మీమ్స్ కూడా వస్తున్నాయి. ఏది ఏమైనా శంకర్ నుంచి అప్డేట్ వస్తేనే ‘గేమ్ చేంజర్’ రిలీజ్ పై ఒక స్పష్టత వస్తుందని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Tags:    

Similar News