తమన్ - త్రివిక్రమ్ కాంబో.. నెక్స్ట్ ఉంటుందా?

అలాగే తమన్ తో కూడా చాలా వరకు బెస్ట్ ట్యూన్స్ వచ్చేలా చేశారు. కానీ గుంటూరు కారంలో పూర్తి స్థాయిలో క్లిక్కవ్వలేదు. ఆ ఎఫెక్ట్ కూడా థమన్ పై పడే అవకాశం ఉంది.

Update: 2024-12-09 04:39 GMT

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి కెరియర్ మూడు బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చాడు. 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి', 'అల వైకుంఠపురంలో' సినిమాలు ఒకదానిని మించి ఒకటి సక్సెస్ ని అందుకుంది. ఇదిలా ఉంటే నాలుగో సారి మరల త్రివిక్రమ్ తో బన్నీ జతకట్టాడు. 'పుష్ప 2' మూవీ రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ దిశగా దూసుకుపోతోంది. ఈ సినిమాతో నేషనల్ వైడ్ గా ఐకాన్ స్టార్ కి టాప్ స్టార్ గా క్రేజ్ వచ్చింది.

'పుష్ప 2'తో వచ్చిన క్రేజ్ ని మ్యాచ్ చెయ్యాలంటే మరల పాన్ ఇండియా రేంజ్ లో కథలు చెప్పగలిగే దర్శకుల కోసమే బన్నీ చూస్తున్నారు. అందులో భాగంగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ప్రాజెక్ట్ కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమానే నెక్స్ట్ పట్టాలెక్కించబోతున్నారు. ఈ చిత్రాన్ని ఏకంగా 600 కోట్ల బడ్జెట్ తో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు అల్లు అర్జున్ టచ్ చేయని కథాంశంతో ఈ మూవీ ఉండబోతోందని నిర్మాత నాగ వంశీ క్లారిటీ ఇచ్చాడు.

ఇదిలా ఉంటే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎవరిని తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. త్రివిక్రమ్, బన్నీ కాంబో లో వచ్చిన 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి'కి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. అల వైకుంఠపురములో చిత్రానికి తమన్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమా సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అయ్యాయి. బన్నీ కెరియర్ లోనే అతిపెద్ద మ్యూజికల్ హిట్ గా ఈ చిత్రం నిలిచింది. త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో చేసిన 'అరవింద సమేత', 'గుంటూరు కారం' సినిమాలకి కూడా తమన్ తోనే వర్క్ చేయించుకున్నారు.

సితార ఎంటర్టైన్మెంట్స్ లో సినిమాలకి కూడా తమన్ ప్రస్తుతం మ్యూజిక్ అందిస్తున్నాడు. బన్నీ కోసం 'పుష్ప 2'కి థమన్ వర్క్ చేశాడు. అయితే అతని బ్యాగ్రౌండ్ స్కోర్ ని పక్కన పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. తమన్ వర్క్ విషయంలో బన్నీ సంతృప్తి చెందలేకపోయాడు. ఇక మరోసారి ఫుల్ ప్రాజెక్ట్ థమన్ కు ఇవ్వగలరా లేదా అనేది డౌట్ గా మారింది.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ తో వర్క్ చేసిన సంగీతం విషయంలో అతను కంప్లీట్ క్లారిటీతో ఉంటాడు. అందుకే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైన అతని సినిమాలలో సాంగ్స్ అన్ని కూడా త్రివిక్రమ్ ఫ్లేవర్ లోనే ఉంటాయి. అలాగే తమన్ తో కూడా చాలా వరకు బెస్ట్ ట్యూన్స్ వచ్చేలా చేశారు. కానీ గుంటూరు కారంలో పూర్తి స్థాయిలో క్లిక్కవ్వలేదు. ఆ ఎఫెక్ట్ కూడా థమన్ పై పడే అవకాశం ఉంది.

ఫైనల్ గా ఈ సారి బన్నీ, త్రివిక్రమ్ కలిసి చేయబోయేది పాన్ ఇండియా మూవీ. అది కూడా కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కబోతోంది. మరి త్రివిక్రమ్, బన్నీ తమన్ కే ఈ సినిమా ఛాన్స్ ఇస్తారా లేదంటే పాన్ ఇండియా రేంజ్ కాబట్టి ఆ స్టాండర్డ్స్ ని మీట్ అయ్యేవారి కోసం చూస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News