నాగార్జున స్పందన కోసం అక్కినేని ఫ్యాన్స్ వెయిటింగ్..!
నాగ చైతన్య తండేల్ సినిమాలో తన బెస్ట్ ఇచ్చాడు. చైతు పడిన కష్టం తెర మీద కనిపిస్తుంది.
తండేల్ సినిమాతో యువ సామ్రాట్ నాగ చైతన్య సూపర్ హిట్ అందుకున్నాడు. చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ హైలెట్ అవగా చైతు, సాయి పల్లవి కాంబినేషన్ యూత్ ఆడియన్స్ ని మెప్పించేలా చేసింది. లవ్ స్టోరీ తర్వాత నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన ఈ సినిమాతో మరో సక్సెస్ అందుకున్నారు.
తండేల్ సినిమా గురించి ముందు నుంచి మేకర్స్ అంచనాలు పెంచుతూ వచ్చారు. ఇక సినిమా కూడా అందుకు తగినట్టుగా ఉండటంతో హిట్ టాక్ తెచ్చుకుంది. టాక్ తో పాటే కలెక్షన్స్ కూడా అదిరిపోతున్నాయని తెలుస్తుంది. నాగ చైతన్య కెరీర్ లో ఇప్పటివరకు చేసిన ఏ సినిమాకు రానటువంటి పాజిటివిటీ ఇంకా ఫ్యాన్స్ హంగామా తండేల్ సినిమాతో చూపిస్తున్నారు.
ఐతే తండేల్ సినిమా ఇంత సక్సెస్.. సోషల్ మీడియాలో ఇంత పెద్ద చర్చ జరుగుతుంటే కింగ్ నాగార్జున నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు. నాగార్జున సినిమా చూశారా లేదా ఆయన తండేల్ గురించి ఎలా రెస్పాన్స్ అవుతారు. ఇలాంటి విషయాలన్నీ కూడా అక్కినేని ఫ్యాన్స్ తెలుసుకోవాలని అనుకుంటున్నారు. మొన్న ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో నాగ చైతన్య నాన్న సినిమా చూశారు సక్సెస్ మీట్ కి వస్తారని చెప్పాడు.
ఇప్పటివరకు నాగార్జున నుంచి తండేల్ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ రాకపోవడంపై ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. నాగ చైతన్య తండేల్ సినిమాలో తన బెస్ట్ ఇచ్చాడు. చైతు పడిన కష్టం తెర మీద కనిపిస్తుంది. చందు మొండేటి మొదటి నుంచి చెప్పినట్టుగానే తండేల్ తో అక్కినేని ఫ్యాన్స్ ఆకలి తీర్చేశాడని చెప్పొచ్చు. ఐతే తనయుడి సక్సెస్ గురించి కింగ్ కూడా మాట్లాడితే వినాలని అక్కినేని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. తండేల్ సినిమా సెట్స్ మీద ఉన్నప్పటి నుంచి సినిమా నుంచి ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది. ఇక సాంగ్స్ తో సూపర్ బజ్ క్రియేట్ చేయగా ఒక్కోసాంగ్ చార్ట్ బస్టర్ లిస్ట్ లో చేరింది. ఫైనల్ గా సినిమా కూడా అంచనాలను అందుకోవడంతో తండేల్ చైతన్య కెరీర్ లో బెస్ట్ సినిమాగా నిలిచింది.