చాలా కాలం తర్వాత ప్రభాస్ కమర్షియల్ సాంగ్స్ తో!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ది రాజా సాబ్.;
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ది రాజా సాబ్. హార్రర్ థ్రిల్లర్ జానర్‌లో రూపొందుతున్న ఈ మూవీలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ భారీ బడ్జెట్ తో ది రాజా సాబ్ ను నిర్మిస్తోంది.
ప్రభాస్ మొదటిసారి హార్రర్ నేపథ్యంలో చేస్తున్న సినిమా కావడంతో రాజా సాబ్ పై అందరికీ భారీ అంచనాలున్నాయి. దానికి తోడు ఈ మూవీలో ప్రభాస్ వింటేజ్ లుక్స్ లో కనిపిస్తున్నాడు. ఆల్రెడీ రాజా సాబ్ నుంచి రిలీజైన ఫస్ట్ లుక్, గ్లింప్స్ కు ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ రాగా, ప్రభాస్ ఫ్యాన్స్ ఆ లుక్స్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు.
అప్పటివరకు మారుతికి సినిమా ఎందుకు ఇచ్చారన్న ఫ్యాన్స్ ఫస్ట్ లుక్, గ్లింప్స్ చూశాక తమ మాట మార్చుకున్నారు. మరోవైపు మారుతి కూడా ఈ సినిమాలో ప్రభాస్ ను మునుపెన్నడూ చూడని విధంగా చూపించనున్నట్టు ముందు నుంచి చెప్పుకొస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.
రాజా సాబ్ మ్యూజిక్ గురించి తమన్ రీసెంట్ గా ఓ ఇంటర్య్వూలో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తైందని, చాలా కాలం తర్వాత ప్రభాస్ కమర్షియల్ సాంగ్స్ తో వస్తున్నాడని తమన్ చెప్పాడు.
ఈ మూవీలో ఇంట్రో సాంగ్ తో పాటూ ఓ మెలోడీ, ఐటెం సాంగ్ కూడా ఉందని, ఐటెం సాంగ్ లో ప్రభాస్ ముగ్గురు హీరోయిన్లతో కలిసి డ్యాన్స్ చేయబోతున్నాడని, అందులో ప్రభాస్ క్రేజీ స్టెప్స్ చేయబోతున్నాడని వీటితో పాటూ ఓ లవ్ సాంగ్, థీమ్ సాంగ్ కూడా ఉందని తమన్ తెలిపాడు. ప్రభాస్ సినిమా కాబట్టి నార్త్ ఇండియా వాళ్లకి కూడా మ్యూజిక్ నచ్చాలని అందుకే మళ్లీ మ్యూజిక్ ఇస్తున్నట్టు తమన్ చెప్పాడు.