అబ్బవరం 'క'.. భలే క్లోజ్ చేశారు

తన మొదటి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్ తో ప్రేమాయణాన్ని నెక్స్ట్ లెవల్ కి తీసుకొని వెళ్లి ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు.

Update: 2024-07-19 09:58 GMT

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సినిమా సినిమాకి తనని తాను మెరుగుపరుచుకుంటూ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. చివరిగా కిరణ్ నుంచి వచ్చిన మీటర్, రూల్స్ రంజన్ సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. దీంతో కొంత గ్యాప్ తీసుకున్నాడు. తన మొదటి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్ తో ప్రేమాయణాన్ని నెక్స్ట్ లెవల్ కి తీసుకొని వెళ్లి ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా తన కొత్త సినిమా టీజర్ ని కిరణ్ రిలీజ్ చేశారు.

'క' టైటిల్ తో పీరియాడిక్ జోనర్ లో రియలిస్టిక్ సంఘటనల స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటి వరకు చేసిన సినిమాలకి భిన్నమైన కంటెంట్ తో టైం ట్రావెల్ కాన్సెప్ట్ ని లింక్ చేస్తూ ఈ సినిమాని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కిరణ్ అబ్బవరం క్యారెక్టర్ కూడా చాలా కొత్తగా ఉంది. టీజర్ తోనే సినిమాపై క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. ఇప్పటి వరకు కిరణ్ అబ్బవరం చేసిన సినిమాలలో దేనికి రానంత హైప్ ‘క’ చిత్రానికి వచ్చింది.

పాన్ ఇండియా రేంజ్ లోనే ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీకి కిరణ్ అబ్బవరం కూడా నిర్మాణ భాగస్వామిగా ఉండటం విశేషం. అతని కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. సుజిత్ సందీప్ ఈ సినిమాతో దర్శకులుగా పరిచయం అవుతున్నారు. శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కిరణ్ అబ్బవరం కాబోయే భార్య రహస్య గోరఖ్ ఈ మూవీకి సిఈఓగా వ్యవహరిస్తోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా టీజర్ కి అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో డిస్టిబ్యూటర్స్ ఫ్యాన్సీ ధరని రైట్స్ కోసం ఆఫర్ చేస్తున్నారంట. ఇప్పటికే ఆల్ మోస్ట్ బిజినెస్ క్లోజ్ అయ్యిందనే మాట వినిపిస్తోంది. డిజిటల్ రైట్స్ కోసం డిస్కషన్స్ జరుగుతున్నాయంట. త్వరలో ఇవి కూడా మంచి ధరకి అమ్ముడయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మూవీకి సాలిడ్ బిజినెస్ జరగడంతో ఈ చిత్రాన్ని ముందుగా రిలీజ్ చేయాలని కిరణ్ అబ్బవరం టీమ్ ప్లాన్ చేస్తోందంట. మొత్తానికి టీజర్ తోనే సాలీడ్ హైప్ క్రియేట్ చేసిన కిరణ్ మంచి డీల్స్ అందుకున్నట్లు తెలుస్తోంది.

ఇది కాకుండా ‘దిల్ రూబా’ అనే లవ్ స్టోరీ మూవీ కూడా కిరణ్ అబ్బవరం చేస్తున్నాడు. అయితే ‘క’ రిలీజ్ తర్వాతనే ఆ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ఛాన్స్ ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. మరి రూల్స్ రంజన్ సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న కిరణ్ అబ్బవరం ‘క’ మూవీతో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడు అనేది చూడాలి.

Tags:    

Similar News