ఇప్ప‌టికీ అద్దె ఇంట్లోనే ఆ సింగ‌ర్!

మ‌రోవైపు చూడ‌గ‌ల్గితే సెల‌బ్రిటీల్లోనూ ఎంతో మంది ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కుంటున్న వారెంతో మంది.

Update: 2023-12-22 05:51 GMT

సెల‌బ్రిటీలంటే క‌ష్టాలేముంటాయి. అందులోనూ ఆర్దిక ఇబ్బంది అనే మాట ఉండ‌దు. సినిమా చేస్తే ల‌క్ష‌ల్లో..కోట్ల‌లో పారితోషికాలు తీసుకుంటారు. వాళ్ల‌కేం ఆర్దిక ఇబ్బందులేంటి? అనుకోవ‌డం స‌హ‌జం. కాని ఇది నాణేనికి ఒక‌వైపు మాత్ర‌మే. మ‌రోవైపు చూడ‌గ‌ల్గితే సెల‌బ్రిటీల్లోనూ ఎంతో మంది ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కుంటున్న వారెంతో మంది. అందుకు కార‌ణాలు అనేకం తాజాగా గాయ‌ని కౌస‌ల్య సుప‌రిచిత‌మే. ఎన్నో చిత్రాల‌కు ఆమె పాట‌లు పాడారు. ముఖ్యంగా చ‌క్రీ-కౌస‌ల్య కాంబినేష‌న్ అంటే ఎన్నో సినిమాలు గుర్తొస్తాయి.

చ‌క్రీ సంగీతంలో ఆమె ఎన్నో పాట‌లు పాడారు . ఎన్నో స్టేజ్ షోస్ కూడా చేసారు. గాయ‌నిగా ఆమె కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో కౌస‌ల్య కొన్ని వ్య‌క్తిగ‌త విష‌యాలు పంచుకున్నారు. ఆవెంటో ఆమె మాట‌ల్లోనే... 'గాయనిగా నేను సంపాదించాను .. కానీ ఆ సంపాద‌న‌ ఎలా దాచుకోవాలో? ఎక్కడ? పెట్టుబడి పెట్టాలో తెలియలేదు. నాకు అప్పుడు అంత వయసు కూడా లేదు. అందువల్లనే ఇప్పటికీ అద్దె ఇంట్లోనే ఉంటున్నాను. జీవితం ఎప్పుడూ కూడా పాఠాలను నేర్పిస్తూనే ఉంటుంది.

ఎవరైనా సరే డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలనే నేను చెబుతూ ఉంటాను. ఎందుకంటే అది నాకు అనుభవ పూర్వకంగా అర్థమైంది కనుక. ఒకానొక సమయంలో నాకు ఆఫర్లు లేవు . ఏం చేస్తున్నారని ఎవరైనా అడిగితే నా దగ్గర సమాధానం కూడా ఉండేది కాదు. ఆ తర్వాత‌నే నేను మ్యూజిక్ అకాడమి ఏర్పాటు చేసాను. నేను సంగీతంలోనే ఉండాలనే నా కోరిక నెరవేరినందుకు ఆనందంగా ఉంది. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి బాలూ గారు అంటే ఎంతో ఇష్టం.

ఆయనను ఒకసారి చూస్తే చాలు అనుకునే దానిని. 'పాడుతా తీయగా' నుంచే నేను పాపుల‌ర్ అయ్యాను. బాలూగారితో కలిసి డ్యూయెట్స్ పాడతానని కలలో కూడా అనుకోలేదు. 'ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు' కోసం నేను హైదరాబాదులో పాడితే, బాలు గారు పాడింది చెన్నైలో రికార్డు చేశారు. అందువలన ఆయనను కలవలేకపోయాను. ఆ తరువాత నేను అని తెలిసి ఆయన చాలా సంతోషపడ్డారు' అని అన్నారు.

Tags:    

Similar News