హిందీలో సంక్రాంతికి వస్తున్నాం.. హీరో గెస్ చేస్తారా..?

అనిల్ రావిపూడికి ఇదే ప్రశ్న ఎదురైంది. ఒకవేళ హిందీలో సంక్రాంతికి వస్తున్నాం తీస్తే ఎవరిని హీరోగా ఎంపిక చేస్తారని అడగ్గా అనిల్ రావిపూడి సల్మాన్ ఖాన్ తో ఆ రీమేక్ చేస్తానని అన్నారు.

Update: 2025-01-28 03:40 GMT

ఈ సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి వెంకటేష్ కాంబో ఈ సక్సెస్ తో హ్యాట్రిక్ ని ఖాతాలో వేసుకున్నారు. ఆడియన్స్ పల్స్ పట్టేసి వరుస హిట్ లతో దూసుకెళ్తున్న అనిల్ రావిపూడి ఖాతాలో మరో సూపర్ హిట్ పడింది. ఐతే ఈసారి సంక్రాంతికి వస్తున్నాం హిట్ చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. వెంకటేష్ కెరీర్ లోనే నియర్ టు 300 కోట్లు వసూళ్లు రాబడుతున్న సినిమాగా ఈ మూవీ రికార్డ్ సృష్టిస్తుంది.

ఈ సినిమా ముందు నుంచి ఒక పాజిటివ్ బజ్ సినిమా సక్సెస్ కు కారణమైంది. ఇక ఒక భాషలో హిట్ అయిన సినిమా మరో భాషలో రీమేక్ చేస్తుంటారు. ముఖ్యంగా తెలుగులో హిట్టైన సినిమాపై బాలీవుడ్ మేకర్స్ కన్ను పడుతుంది. ఈ క్రమంలో బాలీవుడ్ లో సంక్రాంతికి వస్తున్నం సినిమా రీమేక్ జరిగితే ఎలా ఉంటుంది అనే ఆలోచన మొదలైంది.

అనిల్ రావిపూడికి ఇదే ప్రశ్న ఎదురైంది. ఒకవేళ హిందీలో సంక్రాంతికి వస్తున్నాం తీస్తే ఎవరిని హీరోగా ఎంపిక చేస్తారని అడగ్గా అనిల్ రావిపూడి సల్మాన్ ఖాన్ తో ఆ రీమేక్ చేస్తానని అన్నారు. ఆయన అయితే ఈ కథకు పర్ఫెక్ట్ అని అన్నారు. ఏకంగా సూపర్ హిట్ డైరెక్టరే సల్మాన్ ఖాన్ తో చేస్తా అన్నాడు కాబట్టి సల్మాన్ ఖాన్ ఈ సినిమా చూసేసి రీమేక్ ప్రయత్నాలు మొదలు పెడతారేమో చూడాలి.

వెంకటేష్ కి మాత్రం ఈ సక్సెస్ చాలా రోజుల దాహాన్ని తీర్చేసింది. లాస్ట్ ఇయర్ సంక్రాంతికే వచ్చిన సైంధవ్ సినిమా డిజాస్టర్ కాగా మళ్లీ అదే సంక్రాంతికి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. వెంకీ కెరీర్ లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఐతే సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ ఉంటుంది మళ్లీ మరో సంక్రాంతికి ఆ సినిమా వస్తుందని అన్నారు అనిల్ రావిపూడి.

సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజ్ ముందు ప్రమోషన్స్ కూడా భారీగా చేశారు. ఈ ప్రమోషన్స్ వల్ల కూడా సినిమాకు చాలా క్రేజ్ వచ్చింది. ఒక సినిమాను పర్ఫెక్ట్ ప్లానింగ్ తో చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా సక్సెస్ చూస్తే అర్ధమవుతుంది. అనిల్, వెంకటేష్ కాంబో ఇప్పటికే హ్యాట్రిక్ హిట్లు అందుకోగా మళ్లీ మళ్లీ ఈ కాంబో కలిసి సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించేలా ప్లాన్ చేస్తున్నారు.

Tags:    

Similar News