ఆ సినిమా దెబ్బకి విదేశాలు పారిపోయిన రైటర్!
ప్రభాస్ హీరోగా రామాయణాన్ని ఆధారంగా చేసుకుని ఓంరౌత్ తెరకెక్కించిన తొలి షోతోనే బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది.
భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన పాన్ ఇండియా చిత్రం `ఆదిపురుష్` ఎలాంటి ఫలితాలు సాధిం చిందో తెలిసిందే. ప్రభాస్ హీరోగా రామాయణాన్ని ఆధారంగా చేసుకుని ఓంరౌత్ తెరకెక్కించిన తొలి షోతోనే బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. భారీ విజువల్ వండర్ గా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది? అనుకున్న సినిమా అంతకంతకు విమర్శలు ఎదుర్కుంది. సినిమాపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది.
ఓపాన్ ఇండియా సినిమాపై ఆ రేంజ్ లో ట్రోలింగ్ జరగడం కూడా అదే మొదటిసారి. ఇక డైలాగుల విషయంలో వ్యతిరేకత గురించి చెప్పాల్సిన పనిలేదు. అభ్యంతరక డైలాగులతో రచయిత మనోజ్ ముంతీషర్ తీవ్ర వ్యక్తిగత విమర్శలు ఎదుర్కున్నాడు. ఓ డైలాగ్ పై దిగొచ్చి ఏకంగా క్షమాపణలు కూడా కోరాల్సి వచ్చింది. కొన్ని రకాల విమ్శలపై ధీటైన బధులు ఇచ్చాడు. ఇది ఆయన్ని మరింతగా ఇబ్బందుల్లోకి నెట్టినట్లు అయింది.
ఇది ఇంతవరకూ అందరికీ తెలిసిన సంగతి. కానీ మనోజ్ పై వచ్చిన వ్యతిరేకతకు..విమర్శలకు ఏకంగా విదేశాలు పారిపోయాడు అన్న సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా రివీల్ చేసాడు. రిలీజ్ తర్వాత విమర్శలపై స్పందించి తప్పు చేసాను. అప్పటికే జనాలకు నామీద పీకల వరకూ కోప ఉంది. అలాంటప్పుడు సమయమనంతో మౌనంగా ఉంటే సరిపోయేది.
కానీ నన్ను ద్వేషించారు..చివరికి చంపుతారని బెదిరించే సరికి స్పందించాల్సి వచ్చింది. ఆ తర్వాత విదేశాలకు వెళ్లిపోయాను. వివాదం చల్లారే వరకూ విదేశాల్లోనే ఉన్నాను. అప్పుడే ఆదిపురుష్ సినిమాకి పనిచేసి తప్పు చేసాను అనిపించింది. ప్రపంచం ఓరోజు మంచివాడిగా చూస్తే ..మరో రోజు చెడ్డవాడిగానూ చూస్తుంది. కానీ కుటుంబానికి మాత్రం ఎప్పటికీ హీరోనే. కానీ నేను చేసిన తప్పు నుంచి చాలా విషయాలు తెలుసుకున్నాను. ఇక నుంచి జాగ్రత్తగా ఉంటాను. నాకొక సెకెండ్ ఛాన్స్ కావాలి` అని అన్నారు.