నన్ను అత్యాచారం చేసి చంపుతామంటున్నారు!
కోల్ కత్తా లో మహిళా డాక్టర్ పై జరిగిన అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే
కోల్ కత్తా లో మహిళా డాక్టర్ పై జరిగిన అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే. ఘటనపై యావత్ దేశం రగిలిపోతుంది. నిందితుల్ని తక్షణం శిక్షించాలని ప్రభుత్వం పై తీవ్రమైన ఒత్తిడి నెలకొంది. సోషల్ మీడియా వేదికగా బాధిత కుటుంబానికి అండగా నెటి జనులు నిలుస్తున్నారు. ర్యాలీలు.. నిరసనలతో కొల్ కత్తా రగిలిపోతుంది. సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకూ బాధిత కుటుంబానికి న్యాయం జరగాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.
ఈ దెబ్బకి దీదీ పీఠమే కుదేలైపోతుంది. అయితే ర్యాలీలో పాల్గొన్న హీరోయిన్ మిమీ చక్రవర్తికి బెదిరింపులు వస్తున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిరసన వ్యక్తం చేసినందుకు తనని కూడా అత్యాచారం చేసి చంపుతామని బెదిరిస్తున్నట్లు ఓ సంచలన పోస్ట్ చేసింది మీమీ. ఆధారాలతో కొన్ని స్క్రీన్ షాట్లను కూడా షేర్ చేసింది. మహిళల హక్కుల కోసం పోరాడుతుంటే? కొందరు అత్యాచారం చేస్తామని బెదిరిస్తున్నారు.
ఓ కంప్లైంట్ ఇచ్చి సైబర్ క్రైమ్ పోలీసులకు ట్యాగ్ చేసింది. మిమీ చక్రవర్తి కి రాజకీయ నేపథ్యం ఉంది. 2008లో టీవీ సీరియల్స్ లో నటించిన మీమీ చక్రవర్తి 2012 లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. నటిగా ఎదిగిన అనంతరం 2014-2024 మధ్య మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ తరుపున ఎంపీగానూ పనిచేసింది. ఆ రకంగా పార్టీ గురించి మీమీకి మంచి అవగాహన ఉంది.
ఈ నేపథ్యంలో నిరసనలో పాల్గొన్న ఆమెకి వేధింపులు రావడం ఆసక్తికరంగా మారింది. ఆమెని వేధిస్తుంది తృణమూల్ పార్టీకి చెందిన వారా? లేక ఆకతాయిలా? అన్నది పోలీసులు నిగ్గు తేల్చాల్సి ఉంది. ఓ సెలబ్రిటీ విషయంలోనే ఇలాంటి వేధింపులు ఎదురవుతున్నాయంటే? సామాన్యుల గొంతును ఎందుకు నొక్కరు? అన్న సందేహాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి.