టైగర్ ని కూడా సౌండ్‌ లేకుండానే దించారు

ఈ మధ్య కాలంలో పెద్ద హీరోల సినిమాల థియేట్రికల్‌ రిలీజ్ కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో అంతగా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు మరియు ఫ్యాన్స్ వెయిట్‌ చేస్తున్న విషయం తెల్సిందే.

Update: 2023-11-17 08:21 GMT

ఈ మధ్య కాలంలో పెద్ద హీరోల సినిమాల థియేట్రికల్‌ రిలీజ్ కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో అంతగా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు మరియు ఫ్యాన్స్ వెయిట్‌ చేస్తున్న విషయం తెల్సిందే. హీరోల భారీ బడ్జెట్‌ సినిమాలను ఎక్కువ టికెట్‌ రేట్లు పెట్టి చూడలేని వారు చాలా మంది ఓటీటీ స్ట్రీమింగ్‌ ద్వారా చూసేస్తున్నారు.

చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అన్ని సినిమాలు కూడా ఓటీటీ ద్వారా కేవలం మూడు నుంచి నాలుగు వారాల్లోనే వస్తున్నాయి. కొన్ని రెండు వారాల్లో కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి. తక్కువ సమయంలో స్ట్రీమింగ్‌ చేస్తే ఓటీటీ వారు ప్రచారం, పబ్లిసిటీ లేకుండా వదిలేస్తున్నారు. 50 రోజుల నిబంధన ఉన్న కారణంగా మూడు నాలుగు వారాల్లో స్ట్రీమింగ్‌ చేస్తున్న సమయంలో పబ్లిసిటీ చేయడం లేదు.

ఈ మధ్య కాలంలో చాలా సినిమాలను అన్ని ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్ కూడా ప్రచారం లేకుండానే డైరెక్ట్‌ గా స్ట్రీమింగ్‌ చేస్తున్నారు. కొన్ని సినిమాలను కనీసం ముందు రోజు స్ట్రీమింగ్‌ అప్‌డేట్‌ కూడా ఇవ్వకుండా మధ్యరాత్రి స్ట్రీమింగ్‌ చేసి సోషల్‌ మీడియా ద్వారా చూసేయండి అన్నట్లుగా ప్రకటిస్తున్నారు.

దసరా కానుకగా వచ్చిన రవితేజ టైగర్‌ నాగేశ్వరరావు సినిమాను కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన చేయకుండా అమెజాన్‌ ప్రైమ్‌ స్ట్రీమింగ్‌ చేయడం మొదలు పెట్టింది. ఈ వారం చాలా సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. అందులో టైగర్‌ కూడా వచ్చి చేయడంతో వీకెండ్‌ కి వినోదాల విందు అంటూ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

గజ దొంగ నాగేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిస్తున్న సినిమా అంటూ ప్రచారం చేస్తూ వచ్చారు. చివరకు కల్పిత కథ, యదార్థ పాత్రలు అన్నట్లుగా ప్రచారం చేశారు. థియేట్రికల్‌ రన్‌ లో అనుకున్న స్థాయిలో ఈ సినిమా ఆడలేదు. కానీ ఓటీటీ ద్వారా కచ్చితంగా మంచి ఫలితాన్ని దక్కించుకుంటుందని అంతా అనుకున్నారు. తాజాగా స్ట్రీమింగ్‌ మొదలు అయిన టైగర్ కి ఎలాంటి రెస్పాన్స్ అమెజాన్‌ లో లభిస్తుందో చూడాలి.

Tags:    

Similar News