టైగర్ నాగేశ్వరరావు.. ఓపెనింగ్ టార్గెట్ ఇదే
మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు మరో ఐదు రోజుల్లో బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది.
మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు మరో ఐదు రోజుల్లో బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది. అక్టోబర్ 20న రిలీజ్ కానుంది. అయితే ఈ చిత్రానికి ఒక రోజు ముందే విడుదల కానున్న బాలయ్య భగవంత్ కేసరి, దళపతి విజయ్ లియో పోటీగా ఇది ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్‌కు రెడీ అయినప్పటికీ.. మేజర్‌గా తెలుగు-హిందీలోనే భారీగా విడుదల కానుంది.
అయితే ఈ సినిమాతో రవితేజ కెరీర్లోనే బెస్ట్ అండ్ హైయెస్ట్ ఓపెనింగ్స్ అందుకుంటారని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మాస్ మహారాజా అభిమానులు కూడా ఈ సినిమా పక్కాగా బిగ్ హిట్ అవుతుందని ఆశిస్తున్నారు. రవితేజ లుక్, యాక్టింగ్, సినిమా స్టాండర్డ్స్ అని భారీగా, డిఫరెంట్‌గా ఉండడంతో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రవితేజ నటించి రీసెంట్గా మూవీస్ ఓపెనింగ్స్ వివరాలు బయటకు వచ్చాయి.
తెలుగు రాష్ట్రాలు ఏపీ తెలంగాణలో రవితేజ నటించిన సినిమా ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయంటే. రావణాసుర రూ.4.29కోట్లు, ధమాకా రూ.4.66కోట్లు, రామారావు ఆన్ డ్యూటీ రూ.2.82కోట్లు, ఖిలాడీ రూ.4.30కోట్లు, క్రాక్ రూ.6.25కోట్లు, డిస్కో రాజా రూ.2.54కోట్లు, అమర్ అక్బర్ ఆంటోని రూ.3.40కోట్లు వసూలు చేశాయి. అంటే వీటిలో క్రాక్ మూవీ భారీ ఓపెనింగ్స్‌ను అందుకుంది.
ఆ తర్వాత రావణాసుర, ధమాకా మంచి ఓపెనింగ్స్ వసూళ్లను సాధించాయి. అంటే ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు విషయానికొస్తే.. కనీసం ఈ చిత్రం రూ.4.5 కోట్ల నుంచి రూ.5కోట్ల రేంజ్లో అందుకునే అవకాశం ఉందని అనిపిస్తోంది. ఆ తర్వాత ఈ సినిమా రిజల్ట్, అలాగే భగవంత కేసరి, లియో టాక్‌ను బట్టి కలెక్షన్స్ వస్తాయి. చూడాలి మరి ఈ సినిమా రూ.5 కోట్ల వరకు ఓపెనింగ్స్ వసూలు చేస్తుందా లేదా క్రాక్‌ను బీట్ చేస్తుందా అనేది..
ఇక టైగర్ నాగేశ్వరరావు విషయానికొస్తే.. ఈ సినిమా స్టువర్ట్పురం గజదొంగ జీవిత ఆధారంగా తెరకెక్కించారు. రేణూ దేశాయ్ చాలా కాలం తర్వాత ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు.