హిట్టు లేకున్నా.. రెమ్యునరేషన్ గట్టిగానే..

టాలీవుడ్ లో కొంతమంది హీరోలు హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా రెమ్యునరేషన్ ని ఫిక్స్ చేసుకుంటారు.

Update: 2024-08-30 22:30 GMT

టాలీవుడ్ లో కొంతమంది హీరోలు హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా రెమ్యునరేషన్ ని ఫిక్స్ చేసుకుంటారు. అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తారు. కొన్ని సందర్భాలలో నిర్మాత నుంచి రెమ్యునరేషన్ పరంగా ఏమైనా ఇబ్బంది అయితే మూవీ డబ్బింగ్ చెప్పేందుకు కూడా రారు. ఇలాంటి ఇబ్బందుల కారణంగా ఆలస్యం అయిన సినిమాలు చాలా ఉన్నాయి. ఎంత రిక్వెస్ట్ చేసిన కొందరు హీరోలు మాత్రం వెనక్కి తగ్గరు.

ఇప్పుడు ఓ బడా నిర్మాతకి అలాంటి పరిస్థితే వచ్చిందంట. వరుస ఫ్లాప్ లతో ఉన్న ఓ యంగ్ స్టార్ హీరో సినిమా కమిట్ అయినప్పుడే రెండంకెల రెమ్యునరేషన్ డిమాండ్ చేశాడంట. కామెడీ చిత్రాల దర్శకుడితో మూవీ కన్ఫర్మ్ అయ్యిందంట. నిర్మాత కూడా ముందుగా హీరో అడిగినంత రెమ్యునరేషన్ ఇస్తానని చెప్పారంట. మూవీ షూటింగ్ కూడా ఆల్ మోస్ట్ కంప్లీట్ అయిపోయిందట. ఇంకా ఒక నెల రోజులు షెడ్యూల్ మాత్రమే ఉందంట.

అయితే మూవీ బడ్జెట్ పెరిగిపోవడంతో హీరో రెమ్యునరేషన్ లో కట్ చేయాలని నిర్మాత భావించారంట. అయితే మొత్తం రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందే అని సదరు హీరో ఇప్పుడు పట్టుబట్టాడంట. నిర్మాత చాలాసార్లు బ్రతిమలాడిన తర్వాత సదరు హీరో కొద్దిగా వెనక్కి తగ్గాడంట. దీంతో హీరో రెమ్యునరేషన్ సెటిల్ చేసి పెండింగ్ షూటింగ్ కంప్లీట్ చేయడానికి దర్శక నిర్మాతలు రెడీ అయ్యారంట.

దాంతో పాటు డబ్బింగ్ కూడా వీలైనంత వేగంగా ఫినిష్ చేసి అక్టోబర్ లో దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకి సినిమాని తీసుకొని రావాలని ప్లాన్ చేస్తున్నారంట. ఇప్పుడు ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఆ సినిమాని ఓ పెద్ద నిర్మాత సంస్థ రిలీజ్ చేయడానికి ముందుకొస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దసరాకి రెండు పెద్ద సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్నాయి.

వాటి మధ్యలో పోటీగా ఆ హీరో సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకొని రాబోతున్నారంట. సినిమాపై అయితే పెద్దగా బజ్ లేదు. ఆ కామెడీ దర్శకుడికి ఆశించిన స్థాయిలో సక్సెస్ లు లేవు. మరి మరి ఫ్లాప్ హీరోకి ఈ సినిమా అయిన హిట్ ఇస్తుందా అనేది తెలియాలంటే వేచి చూడాలి.

Tags:    

Similar News