సమంత గ్లామర్ మాయ.. ఎప్పుడూ కొత్తగానే..

హిందీలో మరో వెబ్ సిరీస్ కూడా సమంత చేస్తోందనే టాక్ వినిపిస్తోంది.

Update: 2024-09-28 09:58 GMT

 సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత చేతిలో ప్రస్తుతం సినిమాలు లేకపోయిన కూడా సోషల్ మీడియాలో మాత్రం ట్రెండింగ్ లో ఉంటుంది. ఇన్ స్టాగ్రామ్ లో సమంత చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా తన అప్డేట్స్ తో పాటు అందమైన ఫోటోలని కూడా ఇన్ స్టాగ్రామ్ లో సమంత షేర్ చేస్తూ తన గురించి అందరూ చర్చించుకునేలా చేస్తోంది. ఈ కారణంగా సోషల్ మీడియాలో మోస్ట్ ట్రెండింగ్ హీరోయిన్స్ జాబితాలో సమంత టాప్ లో ఉంటుంది.

ఇదిలా ఉంటే అమ్మడు చివరిగా గత ఏడాది ‘ఖుషి’ మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. సమంత నుంచి ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాకి సంబందించిన ప్రకటన గతంలో వచ్చింది. అయితే ఆ మూవీ ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో సమంత ‘సిటాడెల్’ సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ నవంబర్ లో రిలీజ్ కాబోతోంది.


హిందీలో మరో వెబ్ సిరీస్ కూడా సమంత చేస్తోందనే టాక్ వినిపిస్తోంది. అయితే దానికి సంబందించిన అఫీషియల్ ప్రకటన రాలేదు. సమంత కొత్త సినిమా కోసం ఆమె ఫ్యాన్స్ అయితే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగులో ఒక పాన్ ఇండియా మూవీ కోసం సమంతని సంప్రదించారనే ప్రచారం నడుస్తోంది. దీనిపై ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. ఇటీవల సమంత ముంబైకి షిఫ్ట్ అయ్యింది.


బాలీవుడ్ లో ఎంట్రీ కోసం సమంత ఎదురుచూస్తోంది. అందుకు తగ్గట్లుగా ప్లాట్ ఫామ్ సిద్ధం చేసుకుంటుంది. రెగ్యులర్ గా గ్లామర్ ఫోటోషూట్ లతో సమంత మెస్మరైజింగ్ చేసే లుక్స్ తో ఆకట్టుకుంటుంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలకి లక్షల్లో లైన్ వస్తూ ఉన్నాయి.

తాజాగా బ్లాక్ కలర్ అవుట్ తో అదిరిపోయే స్టిల్స్ తో దిగిన ఫోటోలని సమంత ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి. బ్లాక్ కలర్ లాంగ్ ఫ్రాక్ లో సమంత ఈ లుక్ లో ఇట్టే ఎట్రాక్ట్ చేస్తోంది. ఈ గ్లామర్ ఫోటోలకి ఫ్యాన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ డ్రెస్సింగ్ లో సామ్ చాలా అందంగా ఉందనే మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News