టాలీవుడ్.. 90 రోజులపాటు సినిమాలే సినిమాలు!

జూన్ 27వ తేదీన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి మూవీతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు.

Update: 2024-09-12 01:30 GMT

2024.. అప్పుడే ఎనిమిది నెలలు ఓవర్.. మరో నాలుగు నెలల్లో ఇయర్ కంప్లీట్.. అయితే ఈ ఏడాది సంక్రాంతి తర్వాత పెద్ద హీరోల సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవ్వలేదు. మీడియం, చిన్న సినిమాలు మాత్రమే వచ్చాయి. ఎన్నికలు, ఐపీఎల్ వల్ల వేసవి అంతా వేస్ట్ అయిపోయింది. దీంతో సెకండాఫ్ లోనే బడా హీరోలు తమ సినిమాలతో అలరిస్తున్నారు/ అలరించనున్నారు. జూన్ 27వ తేదీన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి మూవీతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు.

ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ దేవర పార్ట్-1తో సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్.. మంచి రెస్పాన్స్ అందుకుంది. అయితే దేవర మూవీతో 2024 మూడో సినీ క్వార్టర్ కంప్లీట్ అయినట్లే. ఆ తర్వాత అక్టోబర్- డిసెంబర్ లో వివిధ హీరోల చిత్రాలు థియేటర్ల సందడి చేయనున్నాయి. అందుకు ఆయా హీరోల ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

అక్టోబర్, నవంబర్ లో టాలీవుడ్ హీరోల సినిమాల సందడి లేకపోయినప్పటికీ.. డిసెంబర్ లో మాత్రం భారీగా ఉంటుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప-2 మూవీ డిసెంబర్ 6వ తేదీన రిలీజ్ కానుంది. ఆగస్టు 15వ తేదీన విడుదల అవ్వాల్సిన ఆ మూవీని.. డిసెంబర్ కు వాయిదా వేశారు మేకర్స్. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్.. సినిమాపై ఉన్న అంచనాలను భారీగా పెంచేశాయి.

ఇక అదే నెలలో మెగా హీరో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ సందడి చేయనుంది. రిలీజ్ డేట్ ప్రకటించకపోయినా.. క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నామని మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. త్వరలో సెకెండ్ సింగిల్ ను తీసుకురానున్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా షూటింగ్ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత చెర్రీ చేస్తున్న సినిమా కావడంతో మంచి అంచనాలు నెలకొన్నాయి.

అలా 2024 లాస్ట్ సినీ క్వార్టర్ లో బన్నీ, చెర్రీ మాత్రమే రానున్నారు. మిగతా హీరోల చిత్రాల వచ్చే ఏడాది రిలీజ్ కానున్నాయి. పవన్ మూవీస్ సెట్స్ పై ఉన్నా.. ప్రస్తుతానికి హోల్డ్ లో ఉన్నాయి. అయితే పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుండడంతో.. మిగతా ఇండస్ట్రీలకు చెందిన హీరోల సినిమాలు బోలెడు తెలుగులో రిలీజ్ కానున్నాయి. మొత్తానికి మూడు నెలలపాటు మూవీ లవర్స్ కు పండుగే పండుగ. నాన్ స్టాప్ మూవీస్ తో థియేటర్లు కళకళలాడనున్నాయి.

Tags:    

Similar News