ఆగస్టు మీద ఎన్ని ఆశలో..

ప్రతివారం ఏదో ఒక సినిమా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతూ ఉంటాయి

Update: 2023-08-02 07:11 GMT

ప్రతివారం ఏదో ఒక సినిమా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతూ ఉంటాయి. అయితే, ఈ ఆగస్టు మాత్రం సినీ అభిమానులకు పండగ లాంటిది. ఎందుకంటే, ఈ ఆగస్టు నెలలో ఏ వారం కూడా గ్యాప్ లేకుండా సినిమాలు విడుదల అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి వరకు అందరూ ప్రస్తుతం తమ ఆశలన్నీ ఆగస్టుపైనే పెట్టుకున్నారు. నిజానికి ఈ హీరోలందరికీ ప్రస్తుతం ఆగస్టు నెల చాలా క్రూషియల్.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భోళా శంకర్ సినిమా ఆగస్టు11వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. చాలా ప్లాప్ ల తర్వాత చిరు వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. కాగా, ఈ క్రమంలో ప్రస్తుతం చిరుకి భోళా శంకర్ హిట్ అవసరం చాలా ఉంది, మెగాస్టార్ తో పాటు డైరెక్టర్, హీరోయిన్ తమన్నా, కీర్తిసురేష్ లకు కూడా ఈ హిట్ అవసరమే. అందుకే, వీరికి ఈ ఆగస్టు నెల చాలా కీలకంగా మారింది.

ఇక, సూపర్ స్టార్ రజినీకాంత్ కి కూడా మంచి హిట్ చూసి చాలా కాలం అవుతోంది. దీంతో, ఆయనతో పాటు, ఆయన ఫ్యాన్స్ ఎన్నో ఆశలుపెట్టుకున్న మూవీ జైలర్. ఈ మూవీకి నెల్సన్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, ఈ డైరెక్టర్ కూడా బీస్ట్ ప్లాప్ తో ఉన్నాడు కాబట్టి, జైలర్ హిట్ ఆయనకు కూడా చాలా అవసరం. ఈ మూవీ కూడా ఈ ఆగస్టు నెలలోనే విడుదల అవుతుండటం విశేషం.

యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి, జాతిరత్నాలు మూవీతో హిట్ కొట్టాడు. కానీ, అతను హీరోగా టాలీవుడ్ లో సెటిల్ అవ్వాలి అంటే మరో హిట్టు చాలా అవసరం. ఆయన హీరోగా వస్తున్న చిత్రం మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి. హీరోయిన్ అనుష్క కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ మూవీ హిట్ ఇప్పుడు నవీన్ తో పాటు, చాలా కాలం తర్వాత సినిమాతో వస్తున్న అనుష్కకి కూడా చాలా అవసరం.

మెగా ప్రిన్సెస్ వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న గాంఢీవదారి అర్జున కూడా ఈ నెలే విడుదల అవతుంది. ఈ మూవీ హిట్ ఆయనకు చాలా అవసరం. వీరు మాత్రమే కాదు, డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో వస్తున్న పెదకాపు ఈ ఆగస్టులోనే రిలీజ్ కానుంది. ఎనిమిదేళ్ల తర్వాత ఆయన సినిమా థియేటర్ కి వస్తోంది. మధ్యలో నారప్ప వచ్చినా, అది ఓటీటీలో విడుదలైంది.

దీంతో, ఈ మూవీపై ఆయన చాలా ఆశలు పెట్టుకున్నారు. వీరు మాత్రమే కాదు, గత రెండు, మూడు నెలల్లో బేబీ తప్ప మరో సినిమా పెద్దగా హిట్ టాక్ తెచ్చుకోలేకపోయింది. బ్రో మూవీ కేవలం ఫ్యాన్స్ మూవీ అయిపోయింది. దీంతో, సినీ ప్రియులు సైతం ఈ ఆగస్టు నెలలో విడుదలయ్యే సినిమాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి ఏ సినిమా ఎంత వరకు క్లిక్ అవుతుందో చూడాలి.

Tags:    

Similar News