టాలీవుడ్ డిసెంబర్ లెక్క… ఫైనల్ గా తేలేదెన్ని?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది ప్రథమార్ధం లో ఆశించిన స్థాయిలో సక్సెస్ లు లేవు. అలాగే ఫేమ్ ఉన్న సినిమాలు రిలీజ్ కూడా తక్కువగానే జరిగాయి

Update: 2024-07-21 14:30 GMT

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది ప్రథమార్ధం లో ఆశించిన స్థాయిలో సక్సెస్ లు లేవు. అలాగే ఫేమ్ ఉన్న సినిమాలు రిలీజ్ కూడా తక్కువగానే జరిగాయి. వాటిలో కరెక్ట్ గా చూసుకుంటే హనుమాన్, డీజే టిల్లు, కల్కి 2898ఏడీ సినిమాలు మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. మరికొన్ని సినిమాలు కమర్షియల్ సక్సెస్ అందుకున్నాయి. చాలా వరకు సినిమాల డిజాస్టర్ టాక్ తెచ్చుకొని నిర్మాతలకి ఫైనాన్షియల్ గా నష్టాలు తీసుకొచ్చాయి. అయితే ఈ ఏడాది సెకెండాఫ్ మాత్రం టాలీవుడ్ ప్రేక్షకులకి అయితే మంచి రోజులు అని చెప్పొచ్చు.

టైర్ 1, టైర్ 2 హీరోలు చేస్తోన్న సినిమాలలో చాలావరకు ద్వితీయార్ధంలోనే రానున్నాయి. ప్రతి నెల గుర్తింపు ఉన్న సినిమాలు 2-3 రిలీజ్ కాబోతున్నాయి. వాటిలో చాలా సినిమాలపై పాజిటివ్ వైబ్ ఉంది. అయితే ఈ ఏడాది ఆఖరున డిసెంబర్ మాత్రం నిర్మాతలకి పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పాలి. డిసెంబర్ లో ఇప్పటికే అఫీషియల్ గా మూడు సినిమాలు టాలీవుడ్ నుంచి రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసుకున్నాయి.

మరో మూడు, నాలుగు సినిమాలు కూడా డిసెంబర్ లో రిలీజ్ కి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 6న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ పుష్ప ది రూల్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ తర్వాత నితిన్ రాబిన్ హుడ్ డిసెంబర్ 20న రిలీజ్ కానుంది. ఈ సినిమాపై నితిన్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. అలాగే అక్కినేని నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతోన్న తండేల్ మూవీ డిసెంబర్ 20న పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ కానుంది.

ఈ మూడు సినిమాలు మాత్రమే కాకుండా తమిళ్ నుంచి కొన్ని డబ్బింగ్ సినిమాలు డిసెంబర్ నెలలో రిలీజ్ కాబోతున్నాయి. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో రెడీ అవుతోన్న గేమ్ చేంజర్ మూవీని కూడా డిసెంబర్ లోనే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. నిజానికి ముందుగానే రిలీజ్ అనుకున్న కూడా పోస్ట్ ప్రొడక్షన్ అయ్యేసరికి లేట్ అవుతుందని డిసెంబర్ లో రావాలని అనుకుంటున్నారంట.

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న NBK109 మూవీ కూడా డిసెంబర్ లోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పుష్ప ది రూల్ మూవీ వాయిదా పడితే ఆ డేట్ కి NBK109 సినిమాని రిలీజ్ చేయాలనీ అనుకుంటున్నారంట. అలాగే మంచు విష్ణు కన్నప్ప సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించాడు. డేట్ మాత్రం ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఓవరాల్ గా చూసుకుంటే డిసెంబర్ నెలలో 6 తెలుగు సినిమాలు థియేటర్స్ లోకి రాబోతున్నాయి. వీటిలో ఎన్ని ఫైనల్ గా ఆ నెలలో రిలీజ్ కి అందుబాటులోకి వస్తాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News