టీటీడీ కోసం టాలీవుడ్ నుంచి ఇంట్రస్టింగ్ ప్రచారం!!

టీడీపీ బోర్డు చైర్మన్, సభ్యుల పోస్టుల కోసం ప్రభుత్వాలు మారిన ప్రతీసారి భారీ డిమాండ్ నెలకొంటుటుందని అంటారు.

Update: 2024-07-29 11:05 GMT

టీడీపీ బోర్డు చైర్మన్, సభ్యుల పోస్టుల కోసం ప్రభుత్వాలు మారిన ప్రతీసారి భారీ డిమాండ్ నెలకొంటుటుందని అంటారు. ప్రధానంగా ఆర్థికంగా బలంగా ఉన్నవారు ఈ పోస్టులను హోదాగా భావిస్తుంటారని అంటారు. ఈ పోస్టుల కోసం పోటీ పడేవారిలో పలువురు రాజకీయ నాయకులతో పాటు సినిమావాళ్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర నుంచి లిక్కర్ వ్యాపారస్తులు వరకూ పోటీ పడుతుంటారని చెబుతుంటారు.

ఈ క్రమంలో తాజాగా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో... గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న బోర్డు రద్దయ్యింది. అది రద్దై చాలా రోజులు అవుతున్నప్పటికీ... కొత్త బోర్డు మాత్రం ఇంకా రాలేదు. ప్రస్తుతానికి ఎగ్జిక్యూటివ్ అధికారి (ఈవో), అదనపు ఎగ్జిక్యూటివ్ అధికారిని మాత్రం నియమించారు. ఇక బోర్డు నియామకంపైనే అందరి దృష్టీ నెలకొని ఉందని అంటున్నారు.. పలువురు ప్రయత్నాల్లో బిజీగా ఉన్నట్లు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో పలువురి పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా... టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజుకి టీటీడీ చైర్మన్ పోస్ట్ దక్కే అవకాశం ఉందని ఒకసారి ప్రచారం జరిగితే.. ఓ ఛానెల్ అధినేతకు ఆ పదవి ఇస్తారనే టాక్ కూడా పొలిటికల్ సర్కిల్స్ లో ఉంది. ఇదే క్రమంలో... ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ సోదరుడు నాగబాబు పేరు తెరపైకి రాగా.. ఆయన ఖండించారు.

ఇలా.. ఆ పోస్ట్ కోసం వారిని ఎంపిక చేశారు.. వీరు ఆశపడుతున్నారు అంటూ రకరకాల ప్రచారాలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ సమయంలో టాలీవుడ్ కి చెందిన ఇద్దరు ప్రముఖుల పేర్లు టీటీడీ మెంబర్ పదవి కోసం పోటీపడుతున్నట్లు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా సీనియర్ నిర్మాత అశ్వినీదత్, సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావులు తాజాగా ప్రచారంలోకి వచ్చాయి.

వాస్తవానికి వీరిద్దరికీ టీడీపీతో మంచి సంబంధాలే ఉన్నాయి! అయితే... టాలీవుడ్ నుంచి ఇవ్వాల్సి వస్తే జనసేన నుంచి కూడా రెండు మూడు పేర్లు తెరపైకి వస్తున్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా ప్రధానంగా పవన్ సోదరుడు నాగబాబు ఎంపీ టిక్కెట్ త్యాగం చేశారని.. అందుకు ఆయనను అకామిడేట్ చేసే అవకాశాలున్నాయని అంటుండగా.. నిర్మాత విశ్వప్రసాద్, దర్శకుడు త్రివిక్రం ల పేర్లు కూడా జనసేన నుంచి వినిపిస్తున్నాయని అంటున్నారు.

మరోపక్క టీడీపీ నుంచి కొంతమంది, జనసేన నుంచి కొంతమంది పోటీ పడే పరిస్థితి ఉంటుందని చెబుతున్న నేపథ్యంలో... ఈసారి టాలీవుడ్ జనాలకు టీటీడీ పదవులు దక్కే అవకాశాలు ఉండవనే చర్చా తెరపైకి వచ్చింది. పైగా... పొత్తు కారణంగా తమ తమ ఎమ్మెల్యే టిక్కెట్లు త్యాగం చేసినవారిలో కీలక నేతలు కూడా ఉండటంతో.. ప్రధానంగా ఈ జాబితాలో మొదటి క్యూలో వారే ఉన్నారని అంటున్నారు. మరి ఫైనల్ గా బాబు ఎవరిని ఎంపిక చేస్తారనేది వేచి చూడాలి.

Tags:    

Similar News