ఆ సినిమాలకి ఎన్నికల ఝులక్?
ఈ ఏడాది డిసెంబర్ లో టాలీవుడ్ నుంచి చాలా సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.
ఈ ఏడాది డిసెంబర్ లో టాలీవుడ్ నుంచి చాలా సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. డిసెంబర్ 1 నుంచి మొదలుపెడితే 22 వరకు సినిమాల సందడి ఉంది. వీటిలో మినిమం రేంజ్ మూవీస్ నుంచి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ వరకు ఉన్నాయి. డిసెంబర్ 1న రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతోన్న యానిమల్ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కి సిద్ధమవుతోంది.
అయితే డిసెంబర్ నెలలో సినిమాలకి ఎన్నికల టెన్సన్ మొదలైంది. తెలంగాణలో ఈ ఏడాది డిసెంబర్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ఏపీలో షెడ్యూల్ ప్రకారం ఎలక్షన్స్ జరిగితే ఏప్రిల్ తర్వాత ఉంటాయి. కాని తెలంగాణలో మాత్రం ఈ ఏడాదిలోనే నిర్వహించాల్సి ఉంటుంది. దేశ వ్యాప్తంగా ఒకే ఎన్నికల విధానం తీసుకొస్తే ఎప్పుడు జరుగుతాయనేది చెప్పలేం.
అయితే ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం అయితే తెలంగాణలో డిసెంబర్ నెలలోనే ఎన్నికలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. మొదటి, రెండు వారాల్లోనే ఈ ఎన్నికల వేడి ఉంటుందని భావిస్తున్నారు. అదే జరిగితే ఎట్టి పరిస్థితిలో కూడా సినిమాలు రిలీజ్ చేయలేని పరిస్థితి ఉంటుంది. పబ్లిక్ మూడ్ అంతా ఎలక్షన్స్ వైపు వెళ్ళిపోతుంది. సినిమాలు చూడటానికి ఎవరూ ఆసక్తి చూపించరు.
ఈ కారణంగా నేచురల్ స్టార్ నాని హాయ్ నాన్న, విక్టరీ వెంకటేష్ సైంధవ్, నితిన్ ఎక్స్ట్రార్దినరీ సినిమా కూడా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాయి. ఒకవేళ ఎన్నికలు జరగకుంటే డిసెంబర్ లో సినిమాలని ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి సిద్ధం అవుతున్నారు. ఒకవేళ ఎన్నికలు జరిగితే మాత్రం డిసెంబర్ ఆఖరులో లేదంటే ఫిబ్రవరిలో సరైన డేట్ చూసుకొని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారంట.
ఎన్నికల షెడ్యూల్ ఎనౌన్స్ చేసేంత వరకు రిలీజ్ పై ఎలాంటి ప్రకటన చేయకుండా ఉండటం బెటర్ అనే ఉద్దేశ్యంతో ఈ సినిమాల నిర్మాతలు ఉన్నారని ఫిల్మ్ నగర్ సర్కిల్ లో వినిపిస్తోంది అయితే డిసెంబర్ ఎన్నికలు కన్ఫర్మ్ అయితే మాత్రం కేవలం ఈ మూడు చిత్రాలకి మాత్రమే కాకుండా చాలా సినిమాలపై ప్రభావం ఉంటుందని చెప్పొచ్చు.