రిస్క్ ని ర‌స్క్ చేసి దూసుకుపోతున్నారే!

ఒక‌ప్పుడు స్టార్ హీరో సినిమా కొత్త ద‌ర్శ‌కుడికి డేట్లు ఇవ్వాలంటే ఎన్నో విష‌యాలు ప‌రిగ‌ణ‌లోకి తీసుకునేవారు

Update: 2024-04-15 05:33 GMT

ఒక‌ప్పుడు స్టార్ హీరో సినిమా కొత్త ద‌ర్శ‌కుడికి డేట్లు ఇవ్వాలంటే ఎన్నో విష‌యాలు ప‌రిగ‌ణ‌లోకి తీసుకునేవారు. అత‌డి గ‌త ట్రాక్ మొత్తం చెక్ చేసి..హీరో ఇమేజ్ ని బ్యాలెన్స్ చేయ‌గ‌ల‌డా? అనుకున్నంత హిట్ ఇవ్వ‌గ‌ల‌డా? అని ఇలా ర‌క‌ర‌కాల స‌మీక‌ర‌ణ‌లతో కాంబినేష‌న్లు సెట్ అయ్యేవి. ఇద్దరు..ముగ్గురు హీరోలు త‌ప్ప అంత ఈజీగా రిస్క్ తీసుకోవ‌డానికి ఆస‌క్తి చూపించే వారు కాదు. కానీ నేడు సీన్ అందుకు రివ‌ర్స్ లో క‌నిపిస్తుంది. రిస్క్ ని ర‌స్క్ లా భావించి కొత్త ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశాలివ్వ‌డంలో ఒక‌రికొక‌రు పోటీ ప‌డుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి తో ఛాన్స్ అంటే మాట‌లా? అలాంటింది 'బింబిసార' ద‌ర్శ‌కుడు రెండ‌వ ఛాన్స్ ఏకంగా చిరుతోనే సంపాదించాడు. అదే 'విశ్వంభ‌ర‌'. ప్ర‌స్తుతం ఈ సినిమా సెట్స్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. బింబిసార తో వ‌షిష్ట ట్యాలెంట్ ని గుర్తించి చిరు ఇచ్చిన అవ‌కాశమిది. ఇక తండ్రీ బాట‌లోనే త‌న‌యుడు వెళ్తున్నాడు. ఆర్సీ 16 బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో ప‌ట్టాలెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. 'ఆర్ ఆర్ ఆర్' తో పాన్ ఇండియా స్టార్ అయిన చ‌ర‌ణ్ ద‌ర్శ‌కుడిగా పెద్ద‌గా అనుభ‌వం లేని బుచ్చిబాబు కి రెండ‌వ సినిమాతోనే ఛాన్స్ క‌ల్పించాడు. ఈ విష‌యంలో బుచ్చి వెరీ ల‌క్కీ అనే అనాలి.

మ‌రో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ రిస్క్ తీసుకోవ‌డంలో ఏమాత్రం వెన‌క‌డుగు వేయ‌డు. అందుకే సుజిత్ కి పెద్ద‌గా అనుభ‌వం లేక‌పోయినా 'సాహా'తో అవ‌కాశం ఇచ్చాడు. తాజాగా 'సీతారామం'తో భారీ క‌మ‌ర్శియ‌ల్ హిట్ అందుకున్న హ‌నురాఘ‌వ‌పూడికి కూడా డార్లింగ్ పాన్ ఇండియా అవ‌కాశ‌మిచ్చిన సంగ‌తి తెలిసిందే. హ‌నుకిది పెద్ద అవకాశమే ఇది. ఇంత‌వ‌ర‌కూ ఆయ‌న స్టార్ హీరోల‌తో సినిమాలు చేసింది లేదు. మిడియం రేంజ్ హీరోలోతోనే సినిమాలు చేసారు.

అలాంటిదిప్పుడు పాన్ ఇండియా స్టార్ తో అవ‌కాశం అంటే ఆషామాషీ కాదుగా. ఆ న‌మ్మ‌కాన్ని హ‌ను నిల బెట్టుకోవాల్సిన ఆవ‌శ్య‌క‌త అంతే ఉంది. నాగ్ అశ్విన్ తో డార్లింగ్ చేస్తోన్న 'క‌ల్కి 2898' కూడా పెద్ద ప్ర‌యోగమే. ఇంత‌వ‌ర‌కూ అత‌డు పాన్ ఇండియా సినిమాలు చేయ‌లేదు. కానీ అత‌డి ట్యాలెంట్ ని న‌మ్మి ప్రభాచ్ ఇచ్చిన అవ‌కాశం. ఇక నాని...రవితేజ...నాగార్జున గురించైతే చెప్పాల్సిన ప‌నిలేదు. కొత్త వాళ్ల‌తో ప‌నిచేయ‌డానికి వాళ్లెప్పుడు సిద్దంగా ఉంటారు. క‌థ‌...న‌మ్మ‌కం కుదిరిందంటే? మ‌రో ఆలోచ‌న లేకుండా ముందుకెళ్లిపోతారు. ఈ విష‌యంలో నాగార్జున నుంచి ర‌వితేజ‌..నాని స్పూర్తి పొందారనొచ్చు.

Tags:    

Similar News