టాలీవుడ్ స్టార్స్.. ఆ 3 నెలల్లో 2 వేల కోట్లా?

2024 సమ్మర్ లోనే అతిపెద్ద భారీ సినిమాలు గ్రాండ్ గా విడుదల కాబోతున్నాయి. ఎక్కువ టైం తీసుకుని మన స్టార్ హీరోలు బిగ్ బడ్జెట్ సినిమాలు చేస్తున్నారు

Update: 2023-08-04 04:26 GMT
టాలీవుడ్ స్టార్స్.. ఆ 3 నెలల్లో 2 వేల కోట్లా?
  • whatsapp icon

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో రాబోయే రోజుల్లో మన అగ్ర హీరోలు ఫ్యాన్ ఇండియా రేంజ్ లోనే కాకుండా పాన్ వరల్డ్ స్థాయిలో కూడా సినిమాలు చేయబోతున్నట్లు అర్థమవుతుంది. అయితే ఈ ఏడాది కంటే వచ్చే ఏడాది టాలీవుడ్ మార్కెట్ స్థాయి మరింత ఎక్కువగా పెరగబోతుంది అని చెప్పవచ్చు. రాజమౌళితో సంబంధం లేకుండానే మన ప్రముఖ దర్శకులు అగ్ర హీరోలతో కలిసి మార్కెట్ను రెండువేల కోట్లు దాటిస్తారు అని ఇండస్ట్రీలో ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి.

2024 సమ్మర్ లోనే అతిపెద్ద భారీ సినిమాలు గ్రాండ్ గా విడుదల కాబోతున్నాయి. ఎక్కువ టైం తీసుకుని మన స్టార్ హీరోలు బిగ్ బడ్జెట్ సినిమాలు చేస్తున్నారు. ఇక ఆలస్యమైనప్పటికీ కూడా కంటెంట్తో మాత్రం బలంగా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకోవడానికి రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక కేవలం మూడు నెలల వ్యవధిలోనే 2000 కోట్ల వరకు బిజినెస్ జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

ముందుగా 2024 మార్చి నెలలో రాంచరణ్ తేజ్ గేమ్ ఛేంజర్ సినిమా రాబోతోంది. ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. దాదాపు 250 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇక సినిమాకు సంబంధించిన బడ్జెట్ ను బట్టి బిజినెస్ లెక్కలు కూడా గట్టిగానే ఉండబోతున్నాయి.

ఇక ఆ తర్వాత ఏప్రిల్ మొదటి వారంలోనే తారక్ దేవర సినిమా రాబోతోంది. ఈ సినిమా కోసం 300 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇక దాని తర్వాత మరో రెండు వారాల గ్యాప్ లోనే పుష్ప సెకండ్ పార్ట్ రాబోతోంది. ఈ సినిమాతో అల్లు అర్జున్ మరో రేంజ్ లో సక్సెస్ అందుకోవాలి అని వెయ్యి కోట్ల మార్కెట్ను అందుకోవాలి అని అనుకుంటున్నారు. ఈ సినిమాపై నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ దాదాపు 300 కోట్ల వరకు ఖర్చు చేయబోతోంది.

అలాగే ప్రభాస్ కల్కి సినిమాపై వైజయంతి మూవీస్ 550 కోట్ల వరకు పెట్టుబడి పెడుతోంది. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా వచ్చే అవకాశం ఉంది. ఇంకా మొదటి పార్ట్ తోనే అశ్విని దత్ వెయ్యి కోట్లకు పైగానే బిజినెస్ చేయాలని చూస్తున్నాడు. ఈ లెక్కన చూస్తే చాలా ఈజీ గానే మన స్టార్ హీరోలు కేవలం సమ్మర్ లోనే 2000 కోట్ల నుంచి 2500 కోట్ల రేంజ్ లో బిజినెస్ అయితే చేయవచ్చని తెలుస్తోంది. మరి వీటిలో ఈ సినిమా అత్యధిక స్థాయిలో ప్రాఫిట్స్ అందిస్తుందో చూడాలి.

Tags:    

Similar News