అందం వెనుక ఆ సంతకం ఏంటో!
ఈ విషయంలో త్రిదా చౌదరి మరింత అడ్వాన్స్ గా ఉంటుంది డిజైనర్ బీచ్ వేర్స్ లో కవ్వించడం సొగసరి ప్రత్యేకత.
టూపీస్..బికినీ స్విమ్ షూట్లలో హీరోయిన్లు అంతా మెప్పిస్తుంటారు. ఫ్రెష్ ఫీల్ ని తీసుకురావడం కోసం రకరకాల స్విమ్ షూట్లు ధరిస్తుంటారు. కెమెరా అప్పిరియన్స్ కోసం బ్యూటీలంతా పరితపిస్తుంటారు. నలుగురిలో సమ్ థింగ్ స్పెషల్ గా హైలైట్ అవ్వాలనిది ప్లాన్. ఈ విషయంలో త్రిదా చౌదరి మరింత అడ్వాన్స్ గా ఉంటుంది. డిజైనర్ బీచ్ వేర్స్ లో కవ్వించడం సొగసరి ప్రత్యేకత.
టూపీస్..బికినీలో కొత్తగా ట్రై చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తుంది. చేతిలో సినిమాలు లేకపోయినా ఇన్ స్టాలో లక్షల ఫాలోవర్స్ ఉన్నారంటే ఇదే ముఖ్య కారణమన్నది తెలిసిందే. తాజాగా అమ్మడు మరోసారి బీచ్ వేర్ లో తళుక్కున మెరిసింది. ఇదిగో ఇక్కడిలా బీచ్ రిసార్స్ట్ లో అమ్మడి స్కిన్ షో హైలైట్ అవుతుంది. షార్ట్...బ్లూకలర్ బ్లౌజు ధరించి అమ్మడు సెగలు పుట్టిస్తుంది.
శరీర సౌందర్యం, నాజుకైనా లుక్ లో బ్యూటీ అద్యంతం చూపరులను ఆకర్షిస్తుంది. అమ్మడి భుజం వెనుక భాగంలో సిగ్నెచర్ ని గమనించొచ్చు. పర్పెక్ట్ బీచ్ వేర్ లో తళుకులీనిన వైనం నెటి జనుల్ని ఆకర్షిస్తుంది. క్యూట్ స్మైల్ తో కెమెరాకి ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. నెటి జనుల కామెంట్లు ఇంట్రెస్టింగ్.
ఇక త్రిదా చౌదరి వెండి తెరపై కనిపించి చాలా కాలమవుతోన్న సంగతి తెలిసిందే. త్రిదా చౌదరి బెంగాలీ అందం. తొలుత అక్కడి చిత్రాలతోనే ఎంట్రీ ఇచ్చింది. అటుపై నిఖిల్ హీరోగా నటించిన `సూర్య వర్సెస్ సూర్య` చిత్రంలో నటించింది. ఆ తర్వాత `మనసుకు నచ్చింది`..`7`..`అనుకున్నది ఒకటి..అయ్యింది ఒకటి` లాంటి తెలుగు చిత్రాల్లో నటించింది. కానీ ఇవేవి త్రిదాకి అంతగా పేరు తీసుకురాలేదు. హిందీలో కూడా కొన్ని సినిమాలు చేసింది. అక్కడా సక్సెస్ కాలేదు. గత ఏడాది మాతృభాషలోనే `బూమ్ రాంగ్` అనే సినిమాలో నటించింది. కొన్ని వెబ్ సిరీస్ లకు పనిచేసింది. కానీ ఎక్కడా బిజీ కాలేదు.