న‌టిని వేధిస్తున్న ఈ షాడో ఎవ‌రో తెలుసా?

అయితే ట్రిప్తి దిమ్రీపై ఒక సెక్ష‌న్ మీడియా త‌ప్పుడు క‌థ‌నాలు వండి వారుస్తోంద‌నేది తాజా గుస‌గుస‌. లేని బోయ్ ఫ్రెండ్ ని ఉన్నాడు!

Update: 2025-01-10 20:30 GMT

చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో ఇన్ సైడ‌ర్- ఔట్ సైడ‌ర్ డిబేట్ ఎల్ల‌పుడూ ఉన్న‌దే. బాలీవుడ్ టు టాలీవుడ్ దీని గురించి చాలా చ‌ర్చ సాగుతోంది. అయితే హిందీ చిత్ర‌సీమ‌ను మాఫియా శాసిస్తోంద‌ని, అక్క‌డ ఔట్ సైడ‌ర్లు మ‌నుగ‌డ సాగించ‌లేర‌ని కంగ‌న లాంటి కొంద‌రు తీవ్రంగా విరుచుకుప‌డుతుంటారు.

సుశాంత్ సింగ్ మ‌ర‌ణం స‌మ‌యంలోను ఇలాంటి ఆవేద‌న ఇండ‌స్ట్రీ ఔట్ సైడ‌ర్ల‌లో వ్య‌క్త‌మైంది. అయితే త‌న‌కు తానుగా ప‌రిశ్ర‌మ ఔట్ సైడ‌ర్ గా ప్ర‌వేశించి త‌న‌కంటూ ఒక స్థానాన్ని ఏర్ప‌రుచుకుంటోంది ట్రిప్తి దిమ్రీ. ఇటీవ‌ల యానిమ‌ల్, భూల్ భుల‌యా 3 వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ల‌లో న‌టించిన ఈ బ్యూటీ బ్యాడ్ న్యూజ్, విక్కీ విద్యా కా వో వాలా వీడియో చిత్రాల‌తోను యువ‌త‌రం హృద‌యాల్లోకి చేరువైంది.

అయితే ట్రిప్తి దిమ్రీపై ఒక సెక్ష‌న్ మీడియా త‌ప్పుడు క‌థ‌నాలు వండి వారుస్తోంద‌నేది తాజా గుస‌గుస‌. లేని బోయ్ ఫ్రెండ్ ని ఉన్నాడు! అని ప్ర‌చారం చేయ‌డం ద్వారా త‌న కెరీర్ ని దెబ్బ కొట్టే ప్ర‌చారం సాగిస్తున్నార‌ని ట్రిప్తీ ఆవేద‌న చెందుతోంద‌ట‌. మోడల్ కం వ్యాపారవేత్త సామ్ మర్చంట్ తో డేటింగ్ చేస్తున్నట్లు ట్రిప్తీపై ఇటీవ‌ల‌ పుకార్లు వచ్చాయి.

కానీ దీనిని ట్రిప్తీ దిమ్రీ ధృవీక‌రించ‌లేదు. తాను ఎదిగినా ఒదిగి ఉండే త‌త్వం ఉన్న అమ్మాయిని అని తెలిపింది. కొన్నిటిని చూసీ చూడ‌న‌ట్టు వ‌దిలేస్తున్నాన‌ని కూడా అంది. తాజా గాసిప్పుల‌ను అంత‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. ట్రిప్తి త‌దుప‌రి `ధడక్ 2`లో కనిపిస్తుంది. విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలోను ఓ చిత్రంలో న‌టిస్తోంది. సౌత్ లోను కొన్ని క‌థ‌లు వింటోంద‌ని స‌మాచారం ఉంది.

Tags:    

Similar News