యానిమ‌ల్ బ్యూటీ.. కాబోయేవాడు ఇలా ఉండాలి

సందీప్ రెడ్డి వంగా `యానిమల్` చిత్రంలో రణబీర్ సరసన నటించింది ట్రిప్తి డిమ్రీ. ఓవ‌ర్ నైట్ లో అసాధార‌ణ‌ పాపులారిటీ సంపాదించింది.

Update: 2024-10-09 10:30 GMT

సందీప్ రెడ్డి వంగా `యానిమల్` చిత్రంలో రణబీర్ సరసన నటించింది ట్రిప్తి డిమ్రీ. ఓవ‌ర్ నైట్ లో అసాధార‌ణ‌ పాపులారిటీ సంపాదించింది. అప్పటి నుండి ఈ బ్యూటీ వెంట‌ప‌డేవాళ్లు ఎక్కువ‌య్యారు. సూట్ కేసుల‌తో నిర్మాత‌లు అడ్వాన్సులు అందిస్తున్నారు. కొత్త ప్రాజెక్టుల‌కు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఇటీవ‌ల బ్యాడ్ న్యూజ్ లో న‌టించింది. ఈ సినిమా కూడా చెప్పుకోద‌గ్గ విజ‌యం సాధించింది. మునుముందు వ‌రుస‌గా సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటిలో ట్రిప్తీ గ్లామ‌ర్‌ షో పై అంచ‌నాలు భారీగా ఉన్నాయి.

ఇక వ్య‌క్తిగ‌త విషయాలు ట‌చ్ చేస్తే... ట్రిప్తీ చాలా కాలంగా సామ్ మర్చంట్‌తో రిలేష‌న్ లో ఉంద‌న్న క‌థ‌నాలొచ్చాయి. కానీ దానిని ఈ భామ క‌న్ఫామ్ చేయ‌లేదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన ల‌వ్ లైఫ్ గురించి మాట్లాడింది. త‌న‌కు కాబోయేవాడు ఎలా ఉండాలో కూడా ఈ సంద‌ర్భంగా ప్ర‌స్థావించింది. ఇంత‌కీ ట్రిప్తీకి కాబోయేవాడు ఎలా ఉండాలి? అంటే... 1993 రొమ్-కామ్ కభీ హాన్ కభీ నాలో షారుఖ్ ఖాన్ త‌న ప్రియురాలిపై ఎలాంటి ప్రేమ‌ను క‌న‌బ‌రుస్తారో అలాంటి స్వచ్ఛమైన ప్రేమను అనుభవించాలనుకుంటున్నట్లు పేర్కొంది. ధూమ్‌లో ఉదయ్ చోప్రా పాత్రలాగే తాను కూడా ఉంటానని ట్రిప్తీ దిమ్రీ పేర్కొన్నారు.

``మెయిన్ ఫిల్మోన్ వాలీ రొమాంటిక్ హన్`` అని ట్రిప్తీ డిమ్రీ తన యూట్యూబ్ ఛానెల్‌లో రణ్‌వీర్ అల్లాబాడియాతో ఇంటరాక్ష‌న్‌లో చెప్పారు. షారుఖ్ ఖాన్- సుచిత్రా కృష్ణమూర్తిల `కభీ హాన్ కభీ నా` తనకు ఇష్టమైన రొమాంటిక్ సినిమా అని పేర్కొంది. రొమాంటిక్ కామెడీలో `కింగ్ ఆఫ్ రొమాన్స్` పాత్ర గురించి మాట్లాడుతూ..ఆ సినిమాలో ఉన్న అమాయకత్వం నిజమైన ప్రేమ‌కు చిహ్నం అని పేర్కొంది.

SRK పాత్ర (సునీల్‌)కు అన్నపై ఉన్న ప్రేమ స్వచ్ఛమైనది.. అమాయకమైనది.. అందువల్ల కాబోయే వాడి నుంచి అలాంటి ప్రేమ‌ను పొందాలనుకుంటోంది. నిజానికి మ‌న మ‌న‌సుకు ద‌గ్గ‌ర‌య్యే వాడిని ఎప్ప‌టికీ క‌నుగొన‌లేమ‌ని ట్రిప్తీ అంది. ప్రతి ఒక్కరిలో లోపాలు ఉన్నాయని..తనకు కూడా కొన్ని ఉన్నాయని పేర్కొంది. కానీ ఒక జంట ఇలాంటి వాటిని దాటి వెళ్ళే విధానం, ఒకరికొకరు రాజీప‌డ‌టం, అర్థం చేసుకోవడం, మంచిపై దృష్టి పెట్టడం ముఖ్యం.. అని అంది. అదే ఇంటర్వ్యూలో ట్రిప్తీ తాను సంబంధాల విష‌యంలో ఎప్పుడూ సీరియస్‌గా ఉంటానని, 2004 యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ధూమ్ 2లోని ఉదయ్ చోప్రా పాత్ర సబ్ ఇన్‌స్పెక్టర్ అలీ అక్బర్ ఫతే ఖాన్‌తో ఎలా ప్ర‌వ‌ర్తిస్తుందో అలానే ఉంటాన‌ని అంది. తాను ప్రేమించే యువ‌తితో పిల్ల‌ల్ని క‌నాల‌ని క‌ల‌లు గ‌నే కుర్రాడిగా ఉద‌య్ చోప్రా పాత్ర‌ను ధూమ్2 లో చిత్రీక‌రించారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ట్రిప్తీ డిమ్రీ తదుపరి భూల్ భూలయ్యా 3లో కార్తీక్ ఆర్యన్, విద్యాబాలన్‌లతో కలిసి కనిపించనున్నారు. హారర్-కామెడీ చిత్రం ఈ దీపావళికి `సింగం ఎగైన్‌`తో కలిసి థియేటర్లలోకి రానుంది. ఆషిఖి 3లోను ట్రిప్తీ న‌టిస్తోంది. అలాగే ధ‌డ‌క్ 2లో అవ‌కాశం అందుకుంది.

Tags:    

Similar News