త్రిప్తి పాతిరోషికం తృప్తి కలిగించేలా..!

ఈమధ్యనే బ్యాడ్ న్యూజ్ సినిమాలో నటించిన త్రిప్తి ఆ సినిమాకు దాదాపు డబుల్ రెమ్యునరేషన్ తీసుకుందని టాక్. అంటే దాదాపు 80 లక్షల దాకా అమ్మడు డిమాండ్ చేసిందట.

Update: 2024-08-12 10:12 GMT

టైం వచ్చేదాకా ప్రయత్నిస్తుంటే ఏదో ఒకరోజు మనం అనుకున్న ఛాన్స్.. మనం కోరుకునే క్రేజ్ మన సొంతం అవుతాయని కొందరిని చూస్తే అర్ధమవుతుంది. రీసెంట్ గా సిల్వర్ స్క్రీన్ పై తన లక్కీ ఛార్మ్ తో మెరుపులు మెరుస్తున్న బ్యూటీ త్రిప్తి డిమ్రి కూడా ఈ లిస్ట్ లో చేరింది. 2017 లోనే సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన అమ్మడు ఈ ఏడేళ్లలో ఐదారు సినిమాలు చేసినా అంతగా క్రేజ్ తెచ్చుకోలేదు. కానీ లాస్ట్ ఇయర్ వచ్చిన యానిమల్ సినిమాతో అమ్మడి ఫేట్ మారిపోయింది. యానిమల్ హీరోయిన్ గా రష్మికకు ఈక్వల్ గా త్రిప్తి క్రేజ్ వచ్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఐతే యానిమల్ ముందు వరకు అమ్మడి 20, 25 లక్షల రెమ్యునరేషన్ మాత్రమే ఉండగా యానిమల్ కోసం 40 లక్షల దాకా రెమ్యునరేషన్ తీసుకుందని టాక్. ఐతే ఎప్పుడైతే యానిమల్ తో సూపర్ పాపులారిటీ తెచ్చుకుందో అప్పటితో అమ్మడి రేంజ్ మారిపోయింది. పారితోషికం విషయంలో కూడా టాప్ లేపేస్తుంది త్రిప్తి. ఈమధ్యనే బ్యాడ్ న్యూజ్ సినిమాలో నటించిన త్రిప్తి ఆ సినిమాకు దాదాపు డబుల్ రెమ్యునరేషన్ తీసుకుందని టాక్. అంటే దాదాపు 80 లక్షల దాకా అమ్మడు డిమాండ్ చేసిందట.

అంతేకాదు రాబోతున్న సినిమాలు అమ్మడు 1 కోటి దాకా రెమ్యునరేషన్ తీసుకుంటుందని తెలుస్తుంది. ప్రస్తుతం త్రిప్తి V.V.V వీడియో, భూ భూలియ 2, దఢక్ 2 సినిమాల్లో నటిస్తుంది. ఈ సినిమాల కోసం త్రిప్తి అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చి మరీ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక అమ్మడు సినిమాలో ఉంటే గ్లామర్ షో గురించి డౌట్లు అక్కర్లేదు అనే రేంజ్ లో రెచ్చిపోతుంది. అందుకే త్రిప్తి కి తను కోరిక పారితోషికం ఇచ్చి ఆఫర్ ఇస్తున్నారు.

యానిమల్ క్రేజ్ తో సౌత్ నుంచి ఆఫర్లు వచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి త్రిప్తి కి ఆఫర్లు వస్తున్నట్టు చెబుతున్నా ఇప్పటివరకు అమ్మడు ఏది కన్ఫర్మ్ చేయలేదు. యానిమల్ తో త్రిప్తి తలరాత మారినట్టు కనిపిస్తున్నా ఈ టైం లోనే అమ్మడు సరైన కథలు ఎంపిక చేసుకుంటే మంచి ఫాం కొనసాగించే ఛాన్స్ ఉంటుంది. మరి త్రిప్తి నెక్స్ట్ సినిమాల లెక్క ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News