యానిమల్ బ్యూటీ మరో అరుదైన ఘనత
ట్రిప్తీ తన పాత్రలకు విస్తృతమైన ప్రశంసలు అందుకుంది.
ఐఎండిబి 2024 జాబితాలో త్రిప్తి డిమ్రీ అగ్రస్థానం దక్కించుకుంది. అలియా భట్, దీపికా పదుకొణె లాంటి అగ్ర నాయికలను సైతం ట్రిప్తి రేసులో వెనక్క నెట్టింది. యానిమల్, బాడ్ న్యూజ్ , విక్కీ విద్యాకి వో లైలా, భూల్ భులయ్యా 3 చిత్రాలలో తన అద్భుతమైన నటనతో భారీగా హృదయాలను కొల్లగొట్టింది ట్రిప్తీ డిమ్రీ. ఇది ఒక అద్భుతమైన సంవత్సరం. ట్రిప్తీ తన పాత్రలకు విస్తృతమైన ప్రశంసలు అందుకుంది. సోషల్ మీడియాల్లోను ట్రిప్తీ ఫోటోషూట్లు వైరల్ అయ్యాయి. ట్రిప్తీ డిమ్రీ వినోద పరిశ్రమలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. IMDb జాబితా 2024 టాప్ 10 అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ తారల జాబితాలో నం.1 గా ర్యాంకింగ్ పొందడం ట్రిప్తి కెరీర్ కి అదనపు బూస్ట్ ఇస్తుందనడంలో సందేహం లేదు.
ఉత్తరాఖండ్‌లో జన్మించిన ట్రిప్తి డిమ్రీ 'పోస్టర్ బాయ్స్'తో బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. అయితే 2018 చిత్రం లైలా మజ్నులో తన పాత్రతో విమర్శకుల ప్రశంసలు పొందింది. బుల్బుల్ - ఖలాలో సంక్లిష్టమైన పాత్రల్లో తన అద్భుత నటన వర్ధమాన తారగా నిలబెట్టింది. ఆమె బహుముఖ ప్రజ్ఞ.. ఆకర్షణీయమైన రూపం.. తన ఎదుగుదలకు సహకరిస్తున్నాయి.
డిసెంబర్ 5న ఐఎండిబి తన వార్షిక జాబితాను 250 మిలియన్లకు పైగా ప్రపంచ సందర్శకుల పేజీ వీక్షణల ఆధారంగా వెల్లడించింది. ట్రిప్టి ఈ ఎంపికకు తన కృతజ్ఞతా భావాన్ని తెలియజేసింది. జాబితాలో నంబర్ 1 ర్యాంక్ పొందడం నిజంగా గొప్ప గౌరవం. ఈ గుర్తింపు నా అభిమానుల వల్లనే సాధ్యమైంది. వారి అపురూపమైన మద్దతుకు.. సహకారానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని తెలిపారు.
ఈ సంవత్సరం మాతృత్వాన్ని స్వాగతించిన దీపికా పదుకొణె, ఫైటర్- కల్కి 2898 AD వంటి భారీ చిత్రాలతో అభిమానుల ముందుకు వచ్చింది. జాబితాలో దీపిక రెండవ స్థానంలో నిలిచింది. ఇషాన్ ఖట్టర్ మూడో స్థానంలో నిలిచాడు. అతడు నికోల్ కిడ్‌మాన్‌తో కలిసి 'ది పర్ఫెక్ట్ కపుల్'లో పాత్ర కారణంగా తన అభిమానుల సంఖ్య పెరిగింది. మూడవ స్థానంలో నిలిచాడు.