మ‌ల్లిక నుంచి నేర్చుకుంటున్న ట్రిప్తి

ట్రిప్తి దిమ్రీ త‌న అందం రూపానికి త‌గ్గ‌ట్టు స్పైసీ క‌థాంశాలు ఉన్న సినిమాల్లో న‌టిస్తూ ఆర్జిస్తోంది.

Update: 2024-09-15 23:30 GMT

యానిమల్ చిత్రంతో కొంద‌రి ద‌శ దిశ మారిపోయాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో విల‌న్ గా న‌టించిన బాబి డియోల్, అతిథిగా న‌టించిన ట్రిప్తి దిమ్రీ ఇద్ద‌రికీ గొప్ప అవ‌కాశాలు వ‌చ్చాయి. వారు స్టార్లుగా ఎదుగుతున్నారు. ట్రిప్తి దిమ్రీ వ‌రుస‌గా భారీ క్రేజీ సీక్వెల్ సినిమాల‌కు సంత‌కాలు చేసింది. బాబి డియోల్ ద‌క్షిణాదిన అగ్ర హీరోల సినిమాల్లో విల‌న్ గా వెలిగిపోతున్నాడు.

ట్రిప్తి దిమ్రీ త‌న అందం రూపానికి త‌గ్గ‌ట్టు స్పైసీ క‌థాంశాలు ఉన్న సినిమాల్లో న‌టిస్తూ ఆర్జిస్తోంది. ఇటీవ‌లే బ్యాడ్ న్యూజ్ అనే చిత్రంలో త‌న‌దైన అందం న‌ట‌న‌తో ఆక‌ర్షించింది. ఈ సినిమా యావ‌రేజ్ గా నిలిచింది. కానీ ట్రిప్తి అంద‌చందాలు యువ‌త‌రాన్ని మ‌త్తెక్కించాయి. తాజా చిత్రం `విక్కీ విద్యా కా వో వాలా వీడియో` విడుదల కోసం ఎదురుచూస్తోంది. ఈ చిత్రంలో ట్రిప్తి డిమ్రీ రెట్రో అనుభూతిని ఆస్వాధిస్తోందిట‌. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో రెట్రో లుక్‌ను రివీల్ చేసింది. `విక్కీ విద్యా కా వో వాలా వీడియో` ట్రైలర్ లాంచ్ లో ఫ్లోర‌ల్ ఫెర్న్-క‌ల‌ర్ చీరను ధరించి క‌నిపించింది. 60 ఏళ్ల వ‌య‌సులో ఉండే 30 ఏళ్ల యువ‌తిగా క‌నిపించ‌బోతోందా? అన్న‌ది ఆస‌క్తిని క‌లిగించింది.

రాజ్‌కుమార్ రావు, మల్లికా షెరావత్, విజయ్ రాజ్, ముఖేష్ తివారీ త‌దిత‌రుల‌తో ట్రిప్తి క‌లిసి న‌టించింది. ఈ సినిమా క‌థాంశం ఆస‌క్తిక‌రం. తమ మొదటి రాత్రిని ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేని జ్ఞాప‌కంగా చిత్రీకరించాలని ఈ జంట ప్ర‌య‌త్నిస్తోంది. తమ వీడియో సేవ్ చేసిన సీడీ వీసీడీ ప్లేయర్‌తో పాటు దొంగ‌త‌నానికి గుర‌వుతుంది. దొంగ‌లు ఎత్తుకెళ్లిన‌ CD ప్లేయర్ ని వెత‌కాలంటే పోలీసులకు ఫిర్యాదు చేయ‌డంతో గందరగోళం ఏర్పడుతుంది.

దొంగ‌త‌నానికి గురైన‌ సీడీని కనుగొనడంలో పోలీసులు విఫలమ‌వుతారు. సీడీ కావాలంటే డ‌బ్బు కావాలంటూ రాజ్‌కుమార్ రావు కుటుంబానికి కాల్ వ‌స్తుంది. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది? అన్న‌దే ఈ చిత్రం ఇతివృత్తం. ప్రధానంగా రిషికేశ్‌లో ఈ సినిమాని చిత్రీకరించారు. దీనికి ఆయుష్మాన్ ఖురానా నటించిన డ్రీమ్ గర్ల్ -డ్రీమ్ గర్ల్ 2 చిత్రాల ద‌ర్శ‌కుడు రాజ్ శాండిల్య దర్శకత్వం వహించారు. బ్యాడ్ న్యూజ్ త‌ర్వాత హ్యాట్రిక్ ని ట్రిప్తి ఆశిస్తోంది. అక్టోబర్ 11న థియేట్రికల్ విడుదల కానున్న ఈ సినిమా ఫ‌లితం ఎలా ఉండ‌నుందో చూడాలి.

Tags:    

Similar News