వైరల్: స్పెషల్ ఫ్లైట్‌‌లో విజయ్ - త్రిష.. ట్రెండింగ్‌లో #JusticeForSangeetha

ఇటీవలే ఓ కార్యక్రమానికి త్రిషతో కలిసి విజయ్ ప్రైవేట్ ఫ్లైట్‌‌లో వెళ్లినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇంతలోనే ఇప్పుడు కీర్తి సురేశ్ పెళ్ళికి సైతం ఇద్దరూ కలిసి ట్రావెల్ చేసారని తెలుస్తోంది.

Update: 2024-12-14 11:54 GMT

సౌత్ హీరోయిన్ కీర్తి సురేశ్ తన స్నేహితుడు ఆంటోనీ తాటిల్‌ ని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే గోవాలో అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లికి పరిమిత సంఖ్యలో బంధువులు, అతిథులు హాజరయ్యారు. అయితే ఈ వివాహానికి స్టార్ హీరో హీరోయిన్లు తలపతి విజయ్, త్రిష కృష్ణన్ హాజరవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతోంది. వీరిద్దరి మధ్య ఏదో వ్యవహారం నడుస్తోందనే విధంగా పుకార్లు షికార్లు చేయడానికి కారణమైంది.

డిసెంబర్ 12న జరిగిన కీర్తి సురేష్ పెళ్లి కోసం జోసెఫ్ విజయ్, త్రిష కలిసే చెన్నై నుంచి స్పెషల్ ఫ్లైట్‌లో గోవాకి వెళ్లినట్లు కథనాలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో విజయ్ కళ్లద్దాలు పెట్టుకొని బ్లూ స్ట్రైప్ షర్ట్‌, బ్లూ జీన్స్ లో కనిపించగా.. త్రిష మాత్రం వైట్ టీ-షర్ట్ ధరించింది. ఇక వీరిద్దరూ కలిసి ఫ్లైట్ లో ప్రయాణించారనడానికి సాక్ష్యంగా ప్యాసెంజర్స్ లిస్ట్ కాపీ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారని గతంలో వచ్చిన రూమర్స్ నిజమే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

విజయ్, త్రిష కలిసి 'ఆది' 'కురువి' 'తిరుప్పాచ్చి' 'గిల్లి' 'లియో' వంటి చిత్రాల్లో జంటగా నటించారు. ఈ ఏడాది విజయ్ నటించిన 'ది గోట్' మూవీలో త్రిష స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆన్ స్క్రీన్ లో సూపర్ జోడీ అనిపించుకున్న విజయ్ - త్రిష.. రీల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లోనూ జోడీ కట్టబోతున్నారని చాలాకాలంగా రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. దీనికి తగ్గట్టుగానే వీరిద్దరూ జంటగా కలిసి ట్రిప్ లకు వెళ్తూ ఉండటం, సోషల్ మీడియాలో హాలిడే ఫోటోలు బయటకు వస్తుండటంతో రిలేషన్ లో ఉన్నారనే పుకార్లకు మరింత బలం చేకూరింది. ఈ క్రమంలో త్రిషని పెళ్లి చేసుకునేందుకు విజయ్ తన భార్య సంగీతకి విడాకులు ఇచ్చేందుకు సిద్ధపడినట్లు కూడా గాసిప్స్ వచ్చాయి.

ఇటీవలే ఓ కార్యక్రమానికి త్రిషతో కలిసి విజయ్ ప్రైవేట్ ఫ్లైట్‌‌లో వెళ్లినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇంతలోనే ఇప్పుడు కీర్తి సురేశ్ పెళ్ళికి సైతం ఇద్దరూ కలిసి ట్రావెల్ చేసారని తెలుస్తోంది. ఇలా జంటగా ప్రైవేట్ ఫ్లైట్‌లో ప్రయాణిస్తుండటం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. యాంటీ ఫ్యాన్స్ ఇద్దరినీ విపరీతంగా ట్రోల్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. విజయ్ భార్య సంగీతకు న్యాయం జరగాలంటూ #JusticeForSangeetha అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. అయితే తలపతి ఫ్యాన్స్ మాత్రం విజయ్ - త్రిష బెస్ట్ ఫ్రెండ్స్ అని, ఎన్నో ఏళ్లుగా వారి మధ్య మంచి సాన్నిహిత్యం ఉందని, వారి స్నేహాన్ని తప్పుగా ప్రచారం చేయడం సరికాదని కామెంట్స్ చేస్తున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే, విజయ్ ప్రస్తుతం 'Thalapathy 69' మూవీలో నటిస్తున్నారు. హెచ్.వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. దీని తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్లు విజయ్ ప్రకటించారు. ఇటీవలే సొంతంగా పొలిటికల్ పార్టీ స్థాపించిన అగ్ర హీరో.. వచ్చే తమిళనాడు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు. అందుకే సినిమాలకు స్వస్తి పలికి, పూర్తిగా ప్రజా సేవకి అంకితం కాబోతున్నట్లు చెప్పారు. మరోవైపు త్రిష ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 'విశ్వంభర' చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. అలానే 'విదాముయార్చి', 'గుడ్ బ్యాడ్ అగ్లీ', 'రామ్', 'ఐడెంటిటీ' 'Suriya 45', 'థగ్ లైఫ్', వంటి మరో అర డజను సినిమాల్లో త్రిష ప్రధాన పాత్రలు పోషిస్తోంది.

Tags:    

Similar News