బన్నీతో మూవీ.. త్రివిక్రమ్ అసలైన ప్లాన్ ఇలా..

ఆ తర్వాత కాస్త రెస్ట్ తీసుకుని తన అప్ కమింగ్ చిత్రాలపై దృష్టి పెట్టనున్నారు.

Update: 2024-08-28 19:30 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇప్పుడు పుష్ప సీక్వెల్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మరో 38 రోజుల్లో ది మోస్ట్ అవైటెడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటి వరకు ఏ సినిమా కూడా రిలీజ్ అవ్వని రీతిలో పుష్ప -2తో థియేటర్లలో సందడి చేయనున్నారు. ఇప్పటికే బన్నీ.. తన షూటింగ్ పార్ట్ ను ఆల్మోస్ట్ క్లియర్ చేసినట్లే. పెండింగ్ ఉన్న ఐటెం సాంగ్ చిత్రీకరణ అయిపోతే అల్లు అర్జున్ ఫ్రీ అయిపోతారు. ఆ తర్వాత కాస్త రెస్ట్ తీసుకుని తన అప్ కమింగ్ చిత్రాలపై దృష్టి పెట్టనున్నారు.

అయితే బన్నీ నెక్స్ట్ ఎవరితో వర్క్ చేయనున్నారనేది ఇంకా క్లియర్ గా అనౌన్స్మెంట్ రాలేదు. గత ఏడాది త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబో మరోసారి రిపీట్ అవ్వనున్నట్లు అనౌన్స్మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. కానీ పుష్ప సీక్వెల్ అయ్యాక ఆయనతోనే బన్నీ సినిమా చేస్తారో లేదో ఇంకా ప్రకటించలేదు. అయితే ఇటీవల పలు ఇంటర్వ్యూస్ లో నిర్మాత నాగ వంశీ.. బన్నీ, త్రివిక్రమ్ ప్రాజెక్టు గురించి ప్రస్తావించారు. అల్లు అర్జున్ తమ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ డైరెక్షన్ లో నెక్స్ట్ వర్క్ చేయనున్నారని తెలిపారు.

ప్రస్తుతం త్రివిక్రమ్ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారని నాగవంశీ చెప్పారు. స్టార్ డైరెక్టర్ రాజమౌళి కూడా టచ్ చేయని జోనర్ లో ఆయన బన్నీతో మూవీ చేస్తున్నట్లు వెల్లడించి అంచనాలు పెంచారు. భారీ సినిమా అని తెలిపారు. కానీ ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేదు. అదే సమయంలో.. బన్నీని సిల్వర్ స్క్రీన్ పై చూసి మూడేళ్లు దాటిపోయింది. దీంతో ఆయన కోసం అభిమానులు చాలా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు త్రివిక్రమ్.. తన సినిమా కోసం ఎంత టైమ్ తీసుకుంటారోనని డిస్కస్ చేసుకుంటున్నారు.

పుష్ప సిరీస్ చిత్రాల్లా ఎక్కువ టైమ్ తీసుకుంటే మాత్రం ఫ్యాన్స్ కచ్చితంగా నిరాశ వ్యక్తం చేస్తారనే చెప్పాలి. అయితే త్రివిక్రమ్ మాత్రం బన్నీతో చేయాల్సిన సినిమాను త్వరగా కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. టాకీ పార్ట్, సాంగ్స్ ను ముందుగా కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయ్యారట. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు వీఎఫ్ ఎక్స్ వర్క్ ను చేయాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. షూటింగ్ పార్ట్ త్వరగా అయిపోతే వేరే డైరెక్టర్ తో ప్రాజెక్టును బన్నీ స్టార్ట్ చేసే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారట. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News