అడ్డంగా బుక్కైన తమన్నా..కోర్టుకి ఏం చెప్పబోతుంది!
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో నటి తమన్నాకి మహరాష్ట్ర సెల్ సమన్లు జారీ చేసింది.
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో నటి తమన్నాకి మహరాష్ట్ర సెల్ సమన్లు జారీ చేసింది. మహదేవ్ అనుబంధ యాప్ అయిన పెయిర్ ప్లే యాప్ ని ప్రమోట్ చేసినందుకు గాను కోర్టు ఆమెకి సమన్నలు జారీ చేసింది. గత ఏడాది జరిగిన ఐపీఎల్ లో అక్రమంగా పెయిర్ ప్లే యాప్ ద్వారా ప్రసారం చేసారని ..ఆ కారణంగా వయోకామ్ సంస్థకు కోట్ల రూపాయలు నష్టం వచ్చినట్లు కేసు పైల్ అయింది. ఈనెల 29న తమన్నా విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
ఇదే కేసులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కి కూడా నోటీసులు అందాయి. ఏప్రిల్ 23 విచారణకు రావాలని ఆదేశించినా ఆయన హాజరు కాలేదు. విదేశాల్లో ఉన్న కారణంగా హాజరు కాలేనని తన స్టేట్ మెంట్ ని రికార్డు చేయడానికి మరో తేదీ ఇవ్వాలని కోర్టును కోరారు. మరి తమన్నా ఈ కేసులో హాజరవుతుందా? లేదా? అన్నది చూడాలి. తమన్నా కెరీర్ లో ఇంతవరకూ ఎలాంటి వివాదాల్లోనూ చిక్కుకోలేదు. తొలిసారి పెయిర్ ప్లే యాప్ కారణంగా ఆమె ప్రతిష్టకి భంగం ఏర్పడింది.
నటిగానూ ఆమెకు ఎంతో మంచి గుర్తింపు ఉంది. దర్శక-నిర్మాతలతో గానీ...హీరోలతో గానీ ఎలాంటి వివాదాల్లోనూ ఆమె పేరు వినిపించలేదు. అంతా కామ్ గోయింగ్ హీరోయిన్ గా భావిస్తారు. మరి ఈ కేసులో తమన్నా ప్రమేయం ఎంతవరకూ ఉందో? కోర్టు నిర్దారించాల్సి ఉంటుంది. ఇక తమన్నా సినిమాల సంగతి చూస్తే క్షణం తీరిక లేకుండా గడుపుతుంది. కోలీవుడ్..బాలీవుడ్..టాలీవుడ్ అంటూ మూడు భాషల్ని దున్నేస్తుంది. తమిళ్ లో ఆరణ్మనై-4 లో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూట్ పూర్తయింది.
హిందీలో `వేద`..`స్త్రీ-2` లో నటిస్తోంది. తెలుగులో ఆమె మెయిన్ లీడ్ లో `ఓదెల-2` అనే చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన తమన్నా లుక్ అభిమానుల్ని ఆకట్టుకుంది. తమన్నా కెరీర్ లో తొలి లేడీ ఓరియేంటెడ్ చిత్రమిది. ఈ సినిమా హిట్ అయితే తమన్నా కొత్త జర్నీ స్టార్ట్ అయినట్లే. ఫీమేల్ సెంట్రిక్ చిత్రాలతోనూ సత్తా చాటుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.