ఇద్దరు హీరోయిన్ల కొట్లాట దేనికోసమో తెలుసా?
ఇద్దరు కథానాయికల మధ్య కొట్లాట లేదా వాగ్వాదం జరిగితే, దానిని `క్యాట్ ఫైట్` అని అందంగా పిలిచేస్తాం.
ఇద్దరు కథానాయికల మధ్య కొట్లాట లేదా వాగ్వాదం జరిగితే, దానిని `క్యాట్ ఫైట్` అని అందంగా పిలిచేస్తాం. సహజంగా ఒకరి అవకాశాన్ని ఇంకొకరు లాక్కుంటే, భామల మధ్య గొడవలు సహజం. ఒకరిపై ఒకరు వీలున్నప్పుడల్లా విరుచుకుపడే అవకాశం ఉంటుంది. కానీ ఈ గొడవ అలాంటిది కాదు.
ప్రముఖ కథానాయికలు కొన్నేళ్ల క్రితం మారిషస్ లో జరిగిన కామన్ ఫ్రెండ్ పార్టీలో ఒకరితో ఒకరు తీవ్రంగా గొడవపడ్డారు. ఒకరి మేనేజర్ ఇంకో హీరోయిన్ ని తంతాను! అంటూ రెచ్చిపోయాడు. దీంతో పరిస్థితి మరింత తీవ్రంగా దిగజారింది. అతడి దుందుడుకు తనాన్ని ఆపేందుకు ఆ హీరోయిన్ తల్లి అతడి చేతిని కూడా పట్టుకుని ఆపే ప్రయత్నం చేసింది. అసలు ఈ గొడవ దేనికోసం జరిగింది? అంటే.. మారిషస్ పార్టీలో వంటలు, ఆహారం నచ్చని సదరు హీరోయిన్ తన నోటిదురుసును ప్రదర్శించింది. ఆ హోటల్ సిబ్బందిని వంటవారిని చెడామడా తిట్టేసింది. అయితే ఆ సమయంలో సర్ధి చెప్పాలని ప్రయత్నించిన మరో హీరోయిన్ ప్రయత్నం బూమరాంగ్ కావడంతో గొడవ ఇద్దరు హీరోయిన్ ల మధ్య బిగ్ ఫైట్ గా మారింది.
వారు భారతీయుల కోసం సాధ్యమైనంత మంచి వంటను ప్రయత్నించారు. కానీ మనం అర్థం చేసుకోవాలి! అని సర్ధి చెప్పే ప్రయత్నం చేయగా ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగింది. ఆమె కొంచెం చదువుకుని ఉంటే తిండి కోసం గోల పెట్టేది కాదని హీరోయిన్ తల్లి వ్యాఖ్యానించడంతో పరిస్థితి మరింతగా దిగజారింది. ఆమె మేనేజర్ ఈమెను, ఈమె తల్లిని కొడతానని చెయ్యెత్తాడు. కానీ దానిని తల్లి గారు ఆపే ప్రయత్నం చేసారు.
మొత్తానికి ఈ రభసకు కారణం.. నోటి దురుసుతనం. సదరు హీరోయిన్ తన కెరీర్‌లో అనేక సందర్భాల్లో నోటి దురుసు కారణంగా వివాదాల్లో చిక్కుకుంది. ప్రముఖ కథానాయికలు శ్రీదేవి, రేఖలను `కాస్మెటిక్ బ్యూటీస్` అని కామెంట్ చేసిందని, కరణ్ అర్జున్ సెట్‌లలో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్‌లు సరిగా స్టెప్పులు వేయలేదని తిట్టిందని కూడా ఆరోపణలు ఉన్నాయి. మారిషస్ పార్టీ గొడవలో నా కంటే తక్కువ రెమ్యునరేషన్ తీసుకునే నువ్వు నాపైనే గొడవకు దిగుతావా? అంటూ ప్రశ్నించింది. అసలు ఇతరులతో ఈ రేంజులో గొడవ పెట్టుకున్న ఆ హీరోయిన్ ఎవరు? అంటే.. ఇటీవలే మహాకుంభమేళాలో ఆధ్యాత్మిక చింతనతో కనిపించిన ప్రముఖ హీరోయిన్ గురించే ఇదంతా. కాంట్రవర్శీ క్వీన్ గా సదరు హీరోయిన్ బాలీవుడ్ లో సూపర్ ఫేమస్. తనవల్ల ఇబ్బంది పడిన మరో హీరోయిన్ ఎవరో కాదు..బద్రిలో నటించింది.