ఎన్టీఆర్ - నీల్.. మళ్ళీ అదే ట్రిక్కు..?
ఇక ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ - ప్రశాంత్ నీల్ మళ్ళీ రెగ్యులర్ స్ట్రాటజీలోకి దిగారు.;
సినిమాలు రెండు పార్ట్‌లుగా రావడం ఇప్పుడు టాలీవుడ్‌లో సాధారణంగా మారిపోయింది. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచడానికి, బిజినెస్ పరంగా కూడా భారీ లాభాలను అందుకోవడానికి ఈ ట్రెండ్‌ను ఎక్కువగా వాడేస్తున్నారు. ఫుల్ మీల్స్ లాంటి సినిమా అంటూ హైప్ పెంచేస్తూ, సగం ముద్ద తినిపించి మధ్యలో ఆపేయడం ప్రేక్షకులను కొంత నిరాశపరుస్తోంది. ఇక రెండో పార్ట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తే, హీరో, దర్శకులు మధ్యలో ఇంకో సినిమాను లైన్‌లో పెట్టడం మరింత ఫ్రస్ట్రేషన్ తెచ్చిపెడుతోంది.
ఇక ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ - ప్రశాంత్ నీల్ మళ్ళీ రెగ్యులర్ స్ట్రాటజీలోకి దిగారు. ఎన్టీఆర్ మూవీ కూడా ఇదే పద్ధతిలో రెండు పార్ట్‌లుగా చేయబోతున్నారనే చర్చ తెరపైకి వచ్చింది. మైత్రి సంస్థ భారీ సినిమాలను మార్కెట్ చేయడంలో ప్రత్యేకమైన ప్లాన్‌తో ముందుకు వెళ్తోంది. సినిమా మొదలయ్యే ముందే ఓ గ్రాండ్ హైప్ క్రియేట్ చేస్తుంది. ఆ హైప్ పెరిగాక, అప్పుడు కథను రెండు పార్ట్‌లుగా విడదీసి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తోంది.
ఇదే టెక్నిక్‌ను పుష్ప కోసం వాడారు. మొదట్లో ఒక్క సినిమాగా అనుకున్నా, ఆ తర్వాత రెండు పార్ట్‌లుగా చేసి బిజినెస్ పరంగా భారీ లాభాలను అందుకున్నారు. ఇప్పుడు ఇదే ప్లాన్ ఎన్టీఆర్-నీల్ సినిమాకు సెట్ చేస్తున్నారనే టాక్ వస్తోంది. ఇప్పటికే దర్శకుడు నీల్ KGF, సలార్ లతో ఈ ఫార్ములాను గట్టిగానే వాదేశాడు. ఇక ఎన్టీఆర్ తో కూడా అదే రూట్లో వెళుతున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల మైత్రి నిర్మాత రవి శంకర్ మాట్లాడుతూ, ఎన్‌టీఆర్, నీల్ సినిమా ఒక ఇంటర్నేషనల్ లెవెల్ హై వోల్టేజ్ ఎంటర్‌టైనర్. ఇది ఇండియన్ సినిమాకే ప్రత్యేకమైన స్క్రిప్ట్. స్కై ఈజ్ ద లిమిట్! అంటూ భారీ అంచనాలు పెంచారు. ఆ మాటలు వినగానే, ఇది కూడా రెండు పార్ట్‌లుగా రావొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. సినిమా బడ్జెట్ 500 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం.
ఒకే సినిమా ద్వారా అంత పెట్టుబడి రికవరీ చేయడం కష్టం. అందుకే లాజికల్‌గా ఈ ప్రాజెక్టును రెండు పార్ట్‌లుగా విడదీసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ప్రేక్షకులకు ప్రధానంగా వచ్చే అసంతృప్తి మాత్రం కథను మొత్తం చెప్పకపోవడమే. తొలిపార్ట్‌లో అసలు కథ కదలదూ, అసలు యాక్షన్ వచ్చే వరకు సినిమా ముగిసిపోతుంది. రెండో పార్ట్ కోసం మరో మూడు నాలుగేళ్లు వేచి చూడాల్సి వస్తుంది. ఇప్పటికే దేవర, కల్కి, సలార్ సినిమాలకు సెకండ్ పార్ట్ లీడ్ వేశారు. ఆ సినిమాలు ఎప్పుడు వస్తాయో సరైన క్లారిటీ లేదు. టాక్ బాగుంటే అన్ని అనుకూలిస్తే సెకండ్ పార్ట్ కు వెళుతున్నారు. లేదంటే మధ్యలోనే వదిలేసే ప్రమాదం కూడా ఉంది. ఇక ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్టును మైత్రి ఎలా ప్రజెంట్ చేస్తుందో చూడాలి.