కన్నప్ప రెమ్యునరేషన్.. ప్రభాస్ ఊహించని ట్విస్ట్?

ఇదిలా ఉంటే ఈ చిత్రంలో ప్రభాస్ నందీశ్వరుడు పాత్రలో కనిపించబోతున్నాడు.

Update: 2024-05-15 04:25 GMT

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో పీరియాడికల్ జోనర్ లో తెరకెక్కుతోన్న మూవీ కన్నప్ప. శ్రీకాళహస్తి నేపథ్యంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా చేసుకొని భక్తిరస యాక్షన్ చిత్రంగా కన్నప్ప రెడీ అవుతోంది. హిందీలో పౌరాణిక సీరియల్స్ తెరకెక్కించిన ముఖేష్ కుమార్ సింగ్ కన్నప్ప చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మంచు మోహన్ బాబు 100+ కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ చిత్రంలో ప్రభాస్ నందీశ్వరుడు పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ క్యారెక్టర్ సినిమాలో చాలా కీలకంగా ఉండబోతోంది. ప్రభాస్ నటిస్తున్నాడనే విషయం బయటకి వచ్చిన తర్వాత కన్నప్ప మూవీపై హైప్ మరింత పెరిగింది. అలాగే బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఓ కీలక పాత్రలో కన్నప్ప చిత్రంలో కనిపిస్తున్నాడు.

మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్, మంచు మోహన్ బాబు, శరత్ కుమార్ లాంటి స్టార్ యాక్టర్స్ కూడా కన్నప్ప చిత్రంలో కీలక పాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం కన్నప్ప షూటింగ్ లో ప్రభాస్ ఉన్నారు. ఈ సినిమా కోసం కేవలం మూడు రోజుల కాల్ షీట్స్ ని డార్లింగ్ ప్రభాస్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాస్ క్యారెక్టర్ కి సంబందించిన పోస్టర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

అందులో అసలు క్యారెక్టర్ కు సంబంధించిన లుక్ రివీల్ చేయకుండా కేవలం నడుచుకొని వస్తున్నట్లు చూపించారు. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం ప్రభాస్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడు అనే విషయంలో అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. ఒక్కో సినిమాకు 150 కోట్లు అందుకుంటున్న హీరో కాబట్టి గెస్ట్ రోల్ అంటే పేమెంట్ గట్టిగానే ఉంటుందని అందరూ భావించారు. కానీ ప్రభాస్ మాత్రం అస్సలు రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి.

ప్రభాస్ కి మంచు మోహన్ బాబు అంటే ప్రత్యేకమైన అభిమానం గతంలో ఇద్దరు కలిగి బుజ్జిగాడు సినిమాలో నటించారు. వారి మధ్య మంచి అనుబంధం ఉంది. అలాగే మంచు విష్ణుతో కూడా ప్రభాస్ కి ఫ్రెండ్ షిప్ ఉంది. ఈ కారణంగానే మంచు మోహన్ బాబు అడగగానే కన్నప్పలో చేయడానికి ప్రభాస్ ఒకే చెప్పాడంట. రెమ్యునరేషన్ కూడా అవసరం లేదని చెప్పాడని మరొక టాక్ వినిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే చిత్ర యూనిట్ అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వాల్సిందే.

మే 20న కన్నప్ప టీజర్ ని చిత్ర యూనిట్ ప్రేక్షకుల ముందుకి తీసుకొని రాబోతోంది. ఈ విషయాన్ని ఇప్పటికే దృవీకరించారు. అయితే టీజర్ లో ప్రభాస్ పాత్రని రివీల్ చేస్తారా లేదంటే సర్ ప్రైజ్ గా ఉంచుతారా అనేది తెలియాల్సి ఉంది. కన్నప్ప క్యారెక్టర్ లో మంచు విష్ణు చాలా కొత్తగా కనిపిస్తాడని పోస్టర్స్ బట్టి తెలుస్తోంది. మరి ఈ మూవీ అతనికి ఎలాంటి హిట్ ఇస్తుందనేది వేచి చూడాలి.

Tags:    

Similar News