పవన్ కళ్యాణ్‌ను ఏపీ CM అని పిలిచిన హీరోయిన్
పవన్ కళ్యాణ్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పేర్కొంటూ ఊర్వశి ట్వీట్ చేయడంతో అది అంతర్జాలం లో వైరల్ గా మారింది.
పవన్ కళ్యాణ్- సాయిధరమ్ తేజ్ హీరోలుగా నటించిన 'బ్రో' విడుదల కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మామ అల్లుళ్ల వీరంగా తెర పై ఎలా ఉంటుందో టీజర్- ట్రైలర్లతో ఇప్పటికే ఒక అంచనాకు వచ్చేసిన అభిమానులు ఈ శుక్రవారం నుంచి థియేటర్ల వద్ద దుమారం సృష్టించడానికి రెడీ అవుతున్నారు.
ఈ సినిమా లో ఇద్దరు అందమైన కథానాయికలు కేతిక శర్మ- ప్రియా ప్రకాష్ వారియర్ లకు ఊర్వశి రౌతేలా లాంటి హాట్ గాళ్ తోడవ్వడంతో ఫైర్ యాడెడ్ టు ద పెట్రోల్ అన్న చందంగా మెగా ఫ్యాన్స్ హీటెక్కిపోతున్నారు. మై డియర్ మార్కండేయ పాట లో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా హాటెస్ట్ అప్పియరెన్స్ ని పెద్ద తెరపై వీక్షించేందుకు ఎంతో క్యూరియస్ గా అందరూ వెయిట్ చేస్తున్నారు.
ఊర్వశి గతం లో టాలీవుడ్ ఈవెంట్లలో సందడి చేసిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ వాల్తేరు వీరయ్య లోను ఊర్వశి ఓ పాట లో కనిపించింది. ఇప్పుడు 'బ్రో' ఈవెంట్ల లోను ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక ప్రతి వేదికపైనా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ప్రశంసల వర్షం కురిపిస్తున్న ఊర్వశి తాజా ట్వీట్ తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనంగా మారింది.
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పేర్కొంటూ ఊర్వశి ట్వీట్ చేయడంతో అది అంతర్జాలం లో వైరల్ గా మారింది. ఊర్వశి రౌతేలా ఇలా రాశారు. ''ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో 'బ్రో' చిత్రం లో స్క్రీన్ స్పేస్‌ను పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది'' అంటూ ఊర్వశి వ్యాఖ్యానించింది.
అయితే ఈ వ్యాఖ్యను కావాలనే తప్పుగా పలికిందా? లేక పొరపాటున అలా పలికేసిందా? అన్నదానికి ఎలాంటి స్పష్ఠత లేదు. కొందరు నెటిజనులు హాటీ చేసిన తప్పుకు ట్రోల్ చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ అభిమానులు తనను సీఎం అని సంబోధించడంతో ఊర్వశి కంగారు పడిందని దానినే స్ఫురణకు తెచ్చుకుని ఇప్పుడు ట్వీట్ లో సీఎం అని సంభోధించిందని రకరకాల థియరీలు పుట్టుకొస్తున్నాయి.