మూడు కోట్ల ఖరీదు గల కేక్ అంత సీన్ ఉందంటారా?
ఆమె పుట్టిన రోజు సందర్భంగా 24 క్యారెట్ల బంగారంతో కేక్ తయారు చేయించి ఆమెతో కట్ చేయించారుట. దాని విలువ మూడు కోట్లు అని చెబుతు న్నారు.
సినిమా సెట్స్ లో హీరో-హీరోయిన్లు...ఇతరుల ఎవరి పుట్టినరోజు వేడుకలు వచ్చిన సెలబ్రేట్ చేయడం అన్నది సహజంగా జరుగుతుంది. టీమ్ అందర్నీ పిలిచి అందరి సమక్షంలో కేట్ చేసి శుభాకాంక్షలు చెబు తుంటారు. ఇది అన్ని పరిశ్రమల్లోనూ ఆచరణలో ఉన్నదే. ఒకే టీమ్ లో ఉన్నప్పుడు కనీసం పుట్టిన రోజు నైనా సెలబ్రేట్ చేయకపోతే దర్శక-నిర్మాతలకు అసంతృప్తిగా అనిపిస్తుంది. అందుకే టీమ్ సభ్యుల్లో ఎవరి పుట్టిన రోజు వచ్చిన విషయం వాళ్లకు తెలిస్తే కచ్చితంగా ఉన్నంతలో సెలబ్రేట్ చేస్తుంటారు.
మరి మూడు కోట్ల రూపాయలు ఖరీదు గల బంగారం కేక్ తెప్పించి సెలబ్రేట్ చేసేంత సరదా? ఎవరికైనా ఉంటుందా? అంటే మాకు ఉందంటూ ముందుకొచ్చారు. హాట్ బ్యూటీ ఊర్శిశీ రౌతేలా పుట్టిన రోజు కావడంతో 'లవ్ డోస్ 2.0' చిత్ర యూనిట్ ఊర్వశి బర్త్ డే ని సెలబ్రేట్ చేసింది. ఆమె పుట్టిన రోజు సందర్భంగా 24 క్యారెట్ల బంగారంతో కేక్ తయారు చేయించి ఆమెతో కట్ చేయించారుట. దాని విలువ మూడు కోట్లు అని చెబుతు న్నారు. ఈ సినిమాలో సింగర్ యోయో హనీసింగ్ తో కలిసి ఊర్శశీ రౌతేలా నటిస్తోంది.
అయితే మూడు కోట్ల ఖరీదుగల కేక్ కట్ చేయడం అన్న దాంట్లో వాస్తవం ఏంటో కెలికితే ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని తేలింది. ఆ సినిమా మొత్తం బడ్జెట్ చూసుకుంటే మూడు నాలుగు కోట్లు ఉంటుంది. అలాం టింది ఊర్వశీ రౌతేలా కోసం మూడు కోట్లు కేక్ తెప్పించి కట్ చేయించారు? అంటే జనాలు చెవుల్లో పువ్వు లేమైనా పెడుతున్నారా? అంటూ నెటి జనులు భగ్గుమంటున్నారు. అబద్దం చెప్పినా అది కనీసం అతికినట్లు అయినా ఉండాలి. ఊర్శశి రౌతేలా ఒక పాటకు లక్షల్లో పారితోషికం తీసుకుంటుంది.
అదీ ఆమె పారితోషికం 10 నుంచి 20 లక్షల మధ్యలో ఉంటుంది. నటిగా కమిట్ అయితే అదనంగా మరో 10 లక్షల వరకూ ఛార్జ్ చేస్తుంది. ఆ రేంజ్ హీరోయిన్ కోసం మూడు కోట్లు కేక్ కట్ చేస్తారా? ఇదంతా పబ్లిసిటీ స్టంట్ లా ఉందంటూ అభిప్రాయ పడుతున్నారు. ఈ సందర్భంగా గతంలో ఊర్వశి రౌతేలా పబ్లిసిటీ కోసం చేసిన కొన్ని రకాల ప్రయత్నాల్ని గుర్తు చేస్తున్నారు. ఇది చిత్ర యూనిట్ పని కూడా కాదని..తనే కావాలని ఇలా కొత్త ప్రచారానికి తెర తీసి ఉంటుందని భావిస్తున్నారు.