ఉస్తాద్ లో పొలిటికల్ గిల్లుడు పక్కా..!

వీలైనంత వరకు తన సినిమాల్లో సామాజిక అంశాల గురించి ప్రశ్నిస్తూనే అధికార పార్టీ తప్పుల పై కూడా కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు

Update: 2023-08-05 10:27 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓవైపు సినిమాలు చేస్తూనే, మరో వైపు రాజకీయాల్లో సత్తా చాటాల ని అనుకుంటున్నారు. నిజానికి ఆయన సినిమాలు మొత్తం పక్కన పెట్టి, రాజకీయీల పై దృష్టి పెట్టాలి అని అనుకున్నారు. కానీ, పవన్ సినిమాల కు దూరం అవ్వడం ఫ్యాన్స్ కి అస్సలు ఇష్టం లేదు. అలాగే రాజకీయ పార్టీకి ఆర్థికంగా సపోర్ట్ కూడా సినిమాలు చేస్తున్నట్లు పవన్ చాలా సందర్భాల్లో చెప్పాడు.

అయితే, తాను సినిమాలు చేస్తూనే, అందులో పొలిటికల్ టచ్ ఇస్తున్నారు. వీలైనంత వరకు తన సినిమాల్లో సామాజిక అంశాల గురించి ప్రశ్నిస్తూనే అధికార పార్టీ తప్పుల పై కూడా కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీ లో అధికార పార్టీకి చెందిన నేతల పై పంచ్ లు వేస్తున్నారు. ఇప్పటికే బ్రో మూవీలో మంత్రి అంబటి రాంబాబు స్పూఫ్ క్యారెక్టర్ ని డిజైన్ చేసి ఫన్నీ డ్యాన్సులు చేయించారు. కేవలం, రెండు, మూడు నిమిషాలు ఉన్న పాత్రకే నానా రభస జరిగింది.

అయితే, ఆయన తరువాతి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ లో మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందట. బ్రోలో చిన్న టీజర్ మాత్రమే చూపించారు. కానీ, ఉస్తాద్ లో సినిమా రేంజ్ లో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. హరీష్ శంకర్ స్టైల్ లో పంచ్ లు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. పంచుల సునామీనే సృష్టించనున్నట్లు తెలుస్తోంది.

మరి, ఉస్తాద్ విడుదల అయ్యాక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా మారుతాయో చూడాలి. కాగా, ఇదే విషయాన్ని ఇన్ డైరెక్ట్ గా హరీష్ శంకర్ ఒకే చేయడం విశేషం. ఇలా ఉంటుంది అని, ఓ న్యూస్ సంస్థ రాయగా, దానికి రిప్లై గా, పవన్ ఐకానిక్ ఖుషి మ్యానరిజంతో ఉన్న ఫోటోని షేర్ చేయడం విశేషం. కాగా, న్యూస్ ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇవ్వడం విశేషం.

ఇదిలా ఉండగా, భారీ బడ్జెట్లో రూపొందుతున్న ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకోగా, దాని ఎడిటింగ్ పనులు కూడా ప్రారంభించగా, ఇప్పుడు రెండో షెడ్యూల్ మొదలుపెట్టడానికి రెడీ అవుతున్నారు. మరి ఈ సినిమాతో హరీష్ పవన్ ఫ్యాన్స్ ని ఎలా మెప్పిస్తాడో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News