SKN తో గొడవ.. మౌనం వీడిన వైష్ణవి!

ఈ నేపథ్యంలో మీడియా వాళ్లు ‘జాక్’ సినిమా ప్రమోషన్ల కోసం వచ్చిన వైష్ణవిని ఎస్కేఎన్ కామెంట్ల గురించి అడిగారు.;

Update: 2025-03-20 17:30 GMT

సినీ ఇండస్ట్రీలో అప్పుడప్పుడూ కొన్ని మాటలు వివాదస్పదంగా మారిపోతాయి. ఇటీవల నిర్మాత ఎస్‌కేఎన్ చేసిన ఒక వ్యాఖ్య ఇదే తరహాలో వివాదాన్ని రేకెత్తించింది. ఆయన తెలుగమ్మాయిలను ఎంకరేజ్ చేస్తే ఏం జరుగుతుందో తెలిసొచ్చింది అని, ఇక నుంచి తెలుగమ్మాయిల విషయంలో పునరాలోచన చేసుకుంటున్నట్టు చేసిన కామెంట్లు పెద్ద చర్చకు దారితీశాయి. ముఖ్యంగా వైష్ణవి చైతన్య గురించి ఆయన అన్నారనే వాదనతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడిచింది. అయితే ఈ వివాదంపై తాజాగా వైష్ణవి స్పందించడంతో క్లారిటీ వచ్చింది.

తమిళ డబ్బింగ్ చిత్రం ఎంటర్‌ ది డ్రాగన్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఎస్‌కేఎన్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. "ఇక్కడ తెలుగు వచ్చిన అమ్మాయిలకంటే తెలుగు రాని అమ్మాయిలనే మేము ఎక్కువగా ప్రేమిస్తుంటాం. ఎందుకంటే తెలుగు వచ్చిన అమ్మాయిల్ని ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందో నాకు తెలిసింది. అందుకే ఇకపై తెలుగురాని అమ్మాయిలను ఎంకరేజ్ చేయాలని డిసైడ్ అయ్యాను" అని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు విన్న చాలా మంది వైష్ణవి చైతన్య గురించే అని భావించారు. ఆ సమయానికి వైష్ణవి, ఎస్‌కేఎన్ కాంబినేషన్‌లో ఓ సినిమా ప్రకటించినా అది పట్టాలెక్కలేదు. దాంతో ఇద్దరి మధ్య విభేదాలున్నాయనే ఊహాగానాలు పెరిగాయి.

అయితే తాజాగా వైష్ణవి చైతన్య దీనిపై స్పందించింది. జాక్ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ వివాదంపై ప్రశ్నించగా, "ఎవరిని అన్నారో నాకు తెలియదు. ఆ న్యూస్ వచ్చినప్పుడే ఆయన వీడియోలో వివరణ ఇచ్చారు. దాంతో విషయం క్లియర్ అయింది. ఆయన నన్ను అనలేదు, కాబట్టి నేను స్పందించాల్సిన అవసరం లేదు" అని తెలిపింది. దీంతో ఆమెపై తున్న అనవసరమైన రూమర్స్ కు బ్రేక్ పడిందని భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా, బేబీ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన వైష్ణవి తొలిచిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్‌లతో కలిసి నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. అయితే ఎస్‌కేఎన్, వైష్ణవి కాంబినేషన్‌లో రెండో సినిమా ఉండాల్సి ఉంది. కానీ అది ఎందుకు ముందుకు వెళ్లలేదనే దానిపై కూడా ఆమె స్పందించింది. "దురదృష్టవశాత్తూ ఆ ప్రాజెక్ట్ మేం ముందుకు తీసుకెళ్లలేకపోయాం. ఫ్యూచర్‌లో ఏదైనా అవకాషం వస్తే మళ్లీ కలిసి పని చేయడానికి రెడీగానే ఉన్నాను" అని తెలిపింది.

ఏఎస్‌కేఎన్ తాను చేసిన కామెంట్స్ పై అప్పుడే వివరణ ఇచ్చాడు. "నేను సరదాగా అన్న మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు. నా ప్రిఫరెన్స్ ఎప్పుడూ తెలుగమ్మాయిలే. ఇప్పటివరకు నేను 8 మంది తెలుగు అమ్మాయిలను ఇండస్ట్రీకి పరిచయం చేశాను" అని చెప్పాడు. ఇప్పుడు వైష్ణవి కూడా వివరణ ఇచ్చిన నేపథ్యంలో ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పడుతుందా లేక మళ్లీ ఇంకో దశలో కొత్త చర్చ మొదలవుతుందా అనేది చూడాలి.

Tags:    

Similar News