హిట్ ప్రాంచైజీ లో ప్లాప్ బ్యూటీ అయితే ఒప్పుకోం!
హిట్ ప్రాంచైజీకి ప్లాప్ బ్యూటీ దేని కంటూ రేస్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.;

బాలీవుడ్ బ్లాక్ బస్టర్ రేస్ ప్రాంచైజీ నుంచి 'రేస్-4' రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయి. సైఫ్ అలీఖాన్, సిద్దార్ధ్ మల్హోత్రా ప్రధాన పాత్రలకు దాదాపు ఖాయమైంది. ఇక హీరోయిన్ గా మెయిన్ లీడ్ కు రకుల్ ప్రీత్ సింగ్ ను కూడా ఖరారు చేసినట్లు వార్త లొస్తున్నాయి. అయితే ఈ ప్రచారం సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపుతుంది. హిట్ ప్రాంచైజీకి ప్లాప్ బ్యూటీ దేని కంటూ రేస్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
రేస్ రెండు భాగాల్లో నటించిన హీరోయిన్లు దీపికా పదుకొణే, కత్రినా కైఫ్ , డైసీ షా , జాక్వెలిన్ కంటే రకుల్ ఉత్తమమా అంటూ అభిప్రాయ పడుతున్నారు. రకుల్ స్థానంలో కృతిసనన్ తీసుకుంటే బాగుంటుందంటున్నారు. హీరోయిన్ విషయంలో మేకర్స్ నిర్ణయాన్ని మార్చుకుని ఫాంలో ఉన్న బ్యూటీలను పరిశీలించాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కియారా అద్వాణీ, అలియాభట్ లాంటి భామల పేర్లు కూడా సజ్జెస్ట్ చేస్తున్నారు.
సైఫ్ అలీఖాన్, అనీల్ కపూర్ లాంటి స్టార్ నటుల మధ్య ఆ రేంజ్ ఉన్న భామలైతేనే బాగుంటుందని నెటిజనుల అభిప్రాయంగా తెలుస్తుంది. మరి ఈ విషయంలో మేకర్స్ పునరాలొచిస్తారా? లేదా? అన్నది చూడాలి. ఇప్పటికే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న రమేష్ తౌరానీ ప్రాజెక్ట్ కి సంబంధించిన కొన్ని విషయాలు కూడా పంచుకున్నారు. సైఫ్ అలీఖాన్ ఎంట్రీ పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేసారు.
రెండు భాగాల్ని మించి 'రేస్ -4'ని మరింత ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఈ ప్రాజెక్ట్ ని టేకప్ చేస్తున్న దర్శకుడి వివరాలు మాత్రం గోప్యంగా ఉంచారు. దర్శకుడు ఎవరు? అన్నది ఇంకా ఎక్కడా ఎలాంటి లీక్ ఇవ్వలేదు. కానీ ఈ ఏడాది మాత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని సన్నాహాలు చేస్తున్నారు.