మాజీ ప్ర‌ధాని వాజ్‌పేయి బ‌యోపిక్ ట్రైలర్

క్రీడాకారులు, చ‌రిత్ర‌కారులు, రాజ‌కీయ నాయ‌కుల బ‌యోపిక్ ల‌కు గొప్ప‌ క్రేజ్ ఉంది. ఇప్పుడు దివంగ‌త ప్ర‌ధాని అట‌ల్ బిహారీ వాజ్ పేయి బ‌యోపిక్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే.

Update: 2023-12-21 05:26 GMT

క్రీడాకారులు, చ‌రిత్ర‌కారులు, రాజ‌కీయ నాయ‌కుల బ‌యోపిక్ ల‌కు గొప్ప‌ క్రేజ్ ఉంది. ఇప్పుడు దివంగ‌త ప్ర‌ధాని అట‌ల్ బిహారీ వాజ్ పేయి బ‌యోపిక్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. `మెయిన్ అటల్ హూన్` టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా ట్రైల‌ర్ తాజాగా విడుద‌లైంది. హిట్జ్ మ్యూజిక్ ట్రైలర్‌ను షేర్ చేసింది. మూడు నిమిషాల 37 సెకన్ల నిడివిగల ట్రైలర్ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జీవితానికి సంబంధించిన చాలా సంగ‌తుల‌ను ఆవిష్క‌రించింది. పంకజ్ త్రిపాఠి ఇందులో టైటిల్ రోల్‌లో నటించారు. దివంగ‌త ప్ర‌ధాని జీవితంలో ఉద్విగ్న క్ష‌ణాల‌కు సంబంధించిన ఎన్నో విష‌యాలు ట్రైల‌ర్ లో ఆక‌ట్టుకున్నాయి.

పంకజ్‌ని దివంగత ప్రధానమంత్రిగా యాప్ట్ గా క‌నిపించ‌గా, యువజన నాయకుడిగా కెరీర్ ప్రారంభించిన‌ అట‌ల్ లోక్‌సభ వరకు ఎదిగేందుకు ఎలాంటి ప్ర‌యాణం సాగించారో ఈ ట్రైల‌ర్ లో చూపించారు. విజువ‌ల్ లో దివంగత ప్రధానమంత్రి హాస్యచ‌తుర‌త‌ను ఆవిష్క‌రించింది. వాజ్ పేయి భారతీయ జనతా పార్టీ (బిజెపి)ని ఏర్పాటు చేయడం, ప్రతిపక్షంలో ఉండి, ఆ తర్వాత ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం గురించి ట్రైల‌ర్ ఎలివేట్ చేసింది. పంకజ్ దివంగత ప్రధానమంత్రిని ఒప్పించేలా యాప్ట్ గా మారారు. అత‌డి మేకోవ‌ర్ ఆస‌క్తిని క‌లిగిస్తోంది. దివంగత ప్రధాని విద్య, సైన్స్, మౌలిక సదుపాయాలపై ఎలాంటి శ్ర‌ద్ధ వ‌హించారో, ప్రపంచ సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన చేసిన కృషి ఎలాంటిదో తెలిసిన చ‌రిత్ర‌. అటల్ బిహారీ వాజ్‌పేయి బాల్యం, రాజకీయ జీవితం, ప్ర‌జాజీవితాల్లో మార్పు తీసుకురావడానికి, భారతదేశాన్ని గొప్ప దేశంగా మార్చడానికి ఆయన అంకితభావాన్ని ఈ ట్రైలర్ చూపించింది.

`మెయిన్ అటల్ హూన్` అనేది దేశ అత్యున్నత పౌర పురస్కారం. భారతరత్నగా స‌త్కారం అందుకుని, మూడుసార్లు ప్రధానమంత్రి అయిన‌ దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి జీవితంలో ఎన్నో ఉత్కంఠ క‌లిగించే అంశాలు ఉన్నాయని ట్రైల‌ర్ లో చూపించారు. రవి జాదవ్ దర్శకత్వం వహించిన `మెయిన్ అటల్ హూన్‌`లో అటల్ బిహారీ వాజ్‌పేయిగా పంకజ్ త్రిపాఠి లీన‌మై నటించారు. ఈ చిత్రానికి సలీం-సులైమాన్ సంగీతం అందించగా, రిషి వీరమణి, రవి జాదవ్‌లు ఈ చిత్రానికి రచనలు చేశారు. మెయిన్ అటల్ హూన్ 19 జనవరి 2024న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. అంతకుముందు ఇది డిసెంబర్ 2023లో విడుదల కావాల్సి ఉన్నా వాయిదా ప‌డింది.

పంకజ్ దివంగత ప్రధానిగా అద్భుతంగా కుదిరార‌ని ట్రైల‌ర్ చూసాక నెటిజ‌నుల నుంచి ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. ఈ చిత్రం గురించి పంకజ్ మాట్లాడుతూ, ``సినిమా కంటే శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి పాత్రతో ప్రయాణం నిజంగా నా హృదయానికి దగ్గరగా ఉంది. వాజ్ పేయి నిజంగా ఒక మ‌హ‌నీయుడైన‌ చరిత్ర‌కారుడు. ఆయ‌న‌ స్ఫూర్తిదాయకమైన కథను ప్రపంచానికి అందించడం మాకు గౌరవం. అటల్ జీ క‌థ‌ను తెరపైకి తీసుకు వ‌స్తున్నాం. మా ప్రయత్నాలను ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను`` అన్నారు.

Full View
Tags:    

Similar News