పిక్ టాక్ : వర్మదే అసలైన న్యూ ఇయర్ సెలబ్రేషన్
తాజాగా ఆయన షేర్ చేసిన ఫోటోలు కూడా అదే విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి.
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా కూడా చాలా స్పెషల్ అనడంలో సందేహం లేదు. ఆయన ఈ మధ్య కాలంలో సినిమాల కంటే కూడా ఎక్కువగా వివాదాలు, ట్వీట్స్ మరియు ఫోటోల కారణంగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెల్సిందే.
వర్మ ఎప్పుడు చూసినా కూడా పార్టీ మూడ్ లో ఉంటాడు అనేది తెలిసిందే. తాజాగా ఆయన షేర్ చేసిన ఫోటోలు కూడా అదే విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. సోషల్ మీడియా ద్వారా ఆయన షేర్ చేసిన ఫోటోలు మరియు వీడియోలు వైరల్ అవుతాయి.. అయితే ఈసారి కుర్రకారు ఆయనను చూసి కుళ్లుకునేలా ఉన్నాయి అనడంలో సందేహం లేదు.
కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అంటూ అమ్మాయిలతో కలిసి మందు తాగుతూ, పబ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోను షేర్ చేశాడు. ఆ ఫోటోలు చూసిన చాలా మంది అసలైన సెలబ్రేషన్ అంటే ఇది.. మనం చేసే సెలబ్రేషన్ అసలు సెలబ్రేషన్ కానే కాదు కదా అన్నట్లుగా మనసులో ఫీల్ అవుతూ ఉంటారు.
నాకు ఎప్పుడు కూడా ఇదే తరహా పార్టీనే అన్నట్లుగా వర్మ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశాడు. ఇలాంటి ప్రత్యేక రోజులను ప్రత్యేకంగా పట్టించుకోని వర్మ ఈసారి అందరూ ఆశ్చర్యపోయే విధంగా ఈ ఫోటోలను షేర్ చేసి మరీ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పడం విడ్డూరంగా ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక వర్మ సినిమాల విషయానికి వస్తే వ్యూహం ను రెండు పార్ట్ లుగా తీసుకు రాబోతున్నట్లు ప్రకటించాడు. అయితే ఆ సినిమా రాజకీయ కారణాల నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చింది. ఇక సారీ అనే సినిమాను కూడా ఒక అందమైన అమ్మాయితో తీసేందుకు రెడీ అవుతున్నాడు. ఇంకా వర్మ ప్రకటించిన సినిమాలు చాలానే ఉన్నాయి. 2024 లో ఆయన నుంచి ఎన్ని సినిమాలు వస్తాయో చూడాలి.