సమంత రాకింగ్... హీరో షాకింగ్!
తాజాగా ఈ ఉదంతాన్నిగుర్తుచేసుకుని కోస్టార్ వరుణ్ ధావన్ సమంతపై ప్రశంసల వర్షం కురిపించాడు.
సమంత వెండి తెరపై కనిపించింది ఏడాది సమీపిస్తుంది. గత ఏడాది సెప్టెంబర్ లో రిలీజ్ అయిన 'ఖుషీ' అనంతరం అమెరికా వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి విశ్రాంతి లోనే ఉంది. ఇండియాకి తిరిగొచ్చినా ఇంతవరకూ కొత్త ప్రాజెక్ట్ లేవి ప్రకటించలేదు. 'సీటాడెల్: హనీ బన్నీ' మాత్రం ఎప్పుడో పూర్తి చేసినా? రిలీజ్ కి ఇంతవరకు నోచుకోలేదు. రకరకాల కారణాలతో వాయిదా పడిన సిరీస్ ఎట్టకేలకు నవంబర్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది.
ఇప్పటికే రిలీజ్ అయన ప్రచార చిత్రాలు మంచి హైప్ తీసుకొచ్చాయి. ఇందులో సరికొత్త సమంతనే ఆవిష్కరించింది. ఇంతవరకూ సమంత యాక్షన్ సన్నివేశాల్లో నటించింది లేదు. తొలిసారి సీటాడెల్ కోసం ఎంతో కఠినమైన యాక్షన్ సన్నివేశాలు సైతం చేసింది. అయితే ఇలాంటి సన్నివేశాలు మయోసైటిస్ బారిన పడిన తర్వాత కూడా సమంత ఎక్కడా వెనక్కి జంక కుండా చేసింది.
ఈ సిరీస్ షూటింగ్లో ఉన్న సమయంలో వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. అయినా సమంత వెనక్కి తగ్గలేదు. ఓవైపు చికిత్స తీసుకుంటూనే షూట్ కి హాజరైంది. తాజాగా ఈ ఉదంతాన్నిగుర్తుచేసుకుని కోస్టార్ వరుణ్ ధావన్ సమంతపై ప్రశంసల వర్షం కురిపించాడు. సమంత అనారోగ్యానికి గురైనా తన ముఖంలో సినిమా అనే ష్యాషన్ మాత్రమే కనిపించింది. ఇసుమొత్తు కూడా నిరుత్సాహానికి గురికాకుండా పనిచేసింది.
అది మా టీమ్ అందరిలో స్పూర్తిని నింపింది. ఆరోగ్య పరంగా సవాళ్లు ఎదుర్కుంటున్నప్పటికీ కఠినమైన యాక్షన్ సన్నివేశాల్లో ఎంతో ధైర్యంగా ముందుకు సాగింది. యాక్షన్ సన్నివేశాలకు ముందు తన ప్రాక్టీస్ కూడా అంతే కఠినంగా ఉండేది. సమంతని చూసి నేను ఆశ్చర్యపోయేవాడిని' అని అన్నాడు. ఈ యాక్షన్ సన్నివేశాల విషయంలో సమంత కూడా ఓపెన్ అయింది. ఇలాంటి యాక్షన్ సన్నివేశాలు చేస్తాన నుకోలేదని, ఇవి చేసింది నేనేనా? అన్న సందేహం సైతం తనకి కలిగిందని' తెలిపింది.