వరుణ్ తేజ్ ని దెబ్బ తీస్తున్న ప్రయోగాలు
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ ఎక్కువగా కమర్షియల్ సినిమాలు చేయడానికి మొగ్గు చూపిస్తూ ఉంటారు
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ ఎక్కువగా కమర్షియల్ సినిమాలు చేయడానికి మొగ్గు చూపిస్తూ ఉంటారు. కొంత ప్రయోగం ఉన్న కచ్చితంగా పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ సినిమాలో ఉండేలా చూసుకుంటారు. అయితే వరుణ్ తేజ్ మాత్రం వారికి విరుద్ధంగా కంటెంట్ బేస్డ్ మూవీస్ ఎక్కువ చేయడానికి ఇష్టపడతాడు.
మొదటి సినిమా ప్రయోగాత్మక చిత్రంగానే తెరకెక్కింది. తరువాత కమర్షియల్ లైన్ లోకి వరుణ్ తేజ్ వచ్చిన కూడా డాన్స్ రాకపోవడం వాటి వైపు పెద్దగా దృష్టి పెట్టడం లేదనే మాట వినిపిస్తోంది. తన బాడీ లాంగ్వేజ్ కి సెట్ అయ్యే కథలు ఎక్కువగా చేయడానికి మొగ్గు చూపిస్తున్నాడు. అయితే వరుణ్ తేజ్ కమర్షియల్ సినిమాలకి బిగ్ స్క్రీన్ పై మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.
ఫిదా ప్యూర్ లవ్ స్టోరీగా చేశాడు. ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ అయ్యింది. ఓపెనింగ్స్ తక్కువ వచ్చిన లాంగ్ రన్ లో భారీ వసూళ్లు సాధించింది. అయితే తొలిప్రేమ సినిమా మొదటి రోజు ఏకంగా 10 కోట్ల గ్రాస్ అందుకుంది. అలాగే గద్దలకొండ గణేష్ కూడా ఫస్ట్ డే 10 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆ స్థాయిలో మరల ప్రభావం చూపించిన సినిమాలు వరుణ్ తేజ్ నుంచి రాలేదు.
మిస్టర్ మూవీ డిజాస్టర్ అయిన మొదటి రోజు 5.75 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అయితే వరుణ్ తేజ్ ప్రయోగాత్మకంగా చేసిన గని మూవీ మొదటి రోజు కేవలం 4.8 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. గత ఏడాది రిలీజ్ అయినా గాండీవదారి అర్జున్ 2 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. తాజాగా వచ్చిన ఆపరేషన్ వాలంటైన్ మూవీ కూడా 2 కోట్ల కంటే తక్కువ గ్రాస్ మొదటి రోజు వసూళ్లు చేసింది.
అంటే వరుణ్ తేజ్ కి ప్రయోగాలు చేయాలనే ఇంటరెస్ట్ ఉన్నా కూడా ఆడియన్స్ మాత్రం ప్రయోగాలపై ఇంట్రెస్ట్ చూపడం లేదు. కొత్త కథల కంటే ముందు మెగా ఇమేజ్ ని ఎస్టాబ్లిష్ చేసే కమర్షియల్ స్టార్ గా వరుణ్ తేజ్ ఎస్టాబ్లిష్ కావాలని ఆశిస్తున్నారా అనే సందేహం కలుగుతోంది. వరుణ్ తేజ్ నెక్స్ట్ మూవీ
మట్కా కమర్షియల్ లైన్ లోనే రానుంది. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న మాఫియా బ్యాక్ డ్రాప్ కథతో వస్తోంది. ఈ సినిమా అయిన అతని ఇమేజ్ ని మళ్ళీ నిలబెడుతుందేమో చూడాలి.