నారీ నారీ మ‌ధ్య శాండ్విచ్ అయిన వెంకీ

అంద‌మైన భార్య‌, ప్రియురాలి మ‌ధ్య శాండ్విచ్ అయ్యాన‌ని స‌ర‌దాగా వ్యాఖ్యానించారు విక్ట‌రీ వెంక‌టేష్.

Update: 2025-01-07 03:50 GMT

అంద‌మైన భార్య‌, ప్రియురాలి మ‌ధ్య శాండ్విచ్ అయ్యాన‌ని స‌ర‌దాగా వ్యాఖ్యానించారు విక్ట‌రీ వెంక‌టేష్. అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `సంక్రాంతికి వ‌స్తున్నాం` సినిమాలో త‌న పాత్ర ఎలా ఉంటుందో వెంకీ రివీల్ చేసారు. ఈ చిత్రం 2025 సంక్రాంతి కానుక‌గా థియేట‌ర్ల‌లో విడుద‌లవుతున్న సంగ‌తి తెలిసిందే. నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ స్వస్థలం నిజామాబాద్‌లో చిత్ర ట్రైలర్ ను విడుద‌ల చేసారు. ట్రైల‌ర్ కి అద్భుత స్పంద‌న వ‌స్తోంది. ఈ సంద‌ర్భంగా ఈవెంట్ లో వెంకీ మాట్లాడుతూ.. తాను వ‌రుస‌గా దిల్ రాజుతో సెంటిమెంటును కొన‌సాగిస్తూ సినిమాలు చేస్తుంటాన‌ని అన్నారు. ఈ సినిమాలో అంద‌మైన భార్య ఐశ్వ‌ర్య రాజేష్, ప్రియురాలు మీనాక్షి మ‌ధ్య న‌లిగిపోయే పాత్ర‌లో క‌నిపిస్తాన‌ని తెలిపారు.

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. సీతమ్మ వాకిట్లో శ్రీమల్లె చెట్టు, ఎఫ్2, ఎఫ్3, సంక్రాంతికి వస్తున్నాం .. మా బ్యాన‌ర్ లో నాలుగు సినిమాలు చేసిన వెంకటేష్‌కి కృతజ్ఞతలు తెలిపారు. వెంకీ అభిమాన న‌టుడు, ఆయ‌న‌తో క‌లిసి ప‌ని చేయాల‌నేది నిర్మాత క‌ల‌. మా కాంబినేషన్‌లో వచ్చిన ప్రతి సినిమా పెద్ద విజయం సాధిస్తుందని, ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తామ‌ని ఆకాంక్షించారు.

దర్శకుడు అనిల్ రావిపూడి తన 8 సినిమాల్లో 6 సినిమాలను వారితోనే చేశానని, వెంకీ తమ కుటుంబ సభ్యుడిలాంటివాడని పేర్కొన్నాడు. ఈ చిత్రం భారీ బ్లాక్‌బస్టర్‌ సాధిస్తుందని, ఇది తమకు చెప్పుకోదగ్గ సంక్రాంతి అని అన్నారు. తన కెరీర్‌కు సహకరించిన నిర్మాతలు దిల్ రాజు , శిరీష్‌లకు దర్శకుడు అనిల్ రావిపూడి కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా సినిమాను ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వెంకటేష్‌కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంక్రాంతికి కుటుంబ సమేతంగా థియేటర్లకు వచ్చి ప్రేక్ష‌కులు నవ్వుతూ ఆనందించాల్సిందిగా కోరాడు.

Tags:    

Similar News